'నువ్వే మాయ చేశావో గానీ'
కాలేజీ నేపథ్యంలో సందేశంతో కూడిన 'జోష్' చిత్రం ద్వారా పరిచయమమైన నాగచైతన్య ప్రస్తుతం తన రెండవ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో మంజుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగచైతన్య సరసన సమంత కథానాయికగా పరిచయమవుతోంది. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది.
ఈ చిత్రం ప్రోగ్రస్ ను గౌతమ్ మీనన్ తెలియజేస్తూ, నాగచైతన్యకు ఎలాంటి కథ కరెక్టో అలాంటి కథతో ఈ చిత్రాన్ని ఎంతో బాధ్యతగా తెరకెక్కిస్తున్నాననీ, చైతన్య అద్భుతమైన నటన ప్రదర్శిస్తున్నాడనీ చెప్పారు. ఇదొక అందమైన ప్రేమ కథా చిత్రమనీ, ప్రేమ కథల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నామనీ తెలిపారు. కథతో పాటు కథనం కూడా చాలా కొత్తగా ఉంటుందన్నారు. అలాగే ఎ.ఆర్.రెహమాన్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. షూటింగ్ దాదాపు పూర్తయిందనీ, జనవరిలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామనీ తెలిపారు. నాగచైతన్య కు ఎలాంటి కథ అయితే సరిపోతుందో అలాంటి కథతో ఈ చిత్రాన్ని గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్నారనీ, అక్కినేని అభిమానులకు ఈ చిత్రం విందు భోజనంలాంటిదనీ నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి 'నువ్వే మాయ చేశావో గానీ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రలోని ఇతర పాత్రల్లో కృష్ణుడు, దేవన్, సురేఖ వాణి, లక్ష్మి, సుధీర్, త్రిష అలెక్స్ తదితరులు నటిస్తున్నారు. ఉమర్జీ అనురాధ మాటలు, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|