కమల్ హీరోయిన్ వేట!
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ద్విభాషాచిత్రం 'ఈనాడు' (ఉన్నైపోల్ ఒరువన్) తర్వాత మరో కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారు. తొలుత బుద్ధుడి దంతం కథతో ఓ పీరియాడిక్ ఫిల్మ్ తీయాలనుకున్న కమల్ ఇందుకు మరింత వ్యవధి అవసరం కావడంతో ఈ గ్యాప్ లో తక్కువ వ్యవధిలో మరో సినిమా చేయాలని నిశ్చయించుకున్నారు. దర్శకుడు కె.ఎస్.రవికుమార్ మరోసారి కమల్ తో ఈ చిత్రానికి పని చేయబోతున్నారు. గతంలో 'తెనాలి', 'భామనే' సత్యభామనే', 'పంచతంత్రం', 'దశావతారం' వంటి చిత్రాలు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కునున్న చిత్రాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి మనువడు ఉదయనిధి స్టాలిన్ నిర్మించనున్నారు.
ఎంత పెద్ద హీరోతో చేసినా వాయివేగంతో సినిమా పూర్తి చేస్తారనే పేరు కె.ఎస్.రవికుమార్ కు ఉంది. ఈ చిత్రాన్ని కూడా జనవరిలో పొంగల్ సందర్భంగా ప్రారంభించి జూన్ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కమల్ కు జోడిగా నటించే కథానాయిక కోసం అన్వేషణ ప్రారంభించారు. ఆసిన్, నయనతార, త్రిష, శ్రియ వంటి స్టార్ హోదా ఉన్న హీరోయిన్ అవసరమని భావిస్తున్నారు. కమల్ మదిలో అనుష్క, తమన్నా వంటి హీరోయిన్ల పేర్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు. కమల్ సరసన నటించే అవకాశం ఎవరిని వరిస్తుందనేది కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది.
Be first to comment on this News / Article!
|