'యు & ఐ' తొలికాపీ రెడీ
ఏ దేశ అభ్యున్నతికైనా యువతే కీలకం. అలాంటి యువత ఆత్మన్యూనతా భావంతో ఆత్మహత్యలు చేసుకోవడం అందర్నీ కలిసి వేస్తుంటుంది. జీవితం ఎంతో ఉన్నప్పటికీ కొన్ని బలహీన క్షణాలలో ఇంకేమీ లేనట్టుగా భావించి యువత ఆత్మహత్యలకు పూనుకుంటోంది. దీనిని కథాంశంగా ఎంచుకుని...ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా యువత ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలనీ, ఆత్యహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తి ఆ చర్యను మానుకుంటే జీవితం ఎంత ఆనందదాయకంగా ఉంటుందనేది 'యు అండ్ ఐ' చిత్రంలో విశిదీకరించనున్నారు. రోహన్, అదితి, అలిషా వైద్ హీరోహీరోయిన్లుగా జె.ఎస్.ఎం.ఎన్. సినిమా బ్యానర్ పై రవీందర్ కుమార్ తోట ఈ చిత్రాన్ని నిర్మించారు. రంజిత్ బెల్లూరి తొలిసారిగా దర్శకుడిగా పరిచయవుతున్నారు. ఈ చిత్రం తొలికాపీ సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి జనవరిలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు దర్శకుడు రంజిత్ తెలిపారు.
ఆత్మహత్య తప్పని ఈ చిత్రంలో చూపిస్తున్నామనీ, అలాగే పుస్తక దానంలోని గొప్పతనాన్ని కూడా ఇందులో చూపుతున్నామనీ ఆయన అన్నారు. చిత్ర యూనిట్ కూడా పుస్తక దానంపైన విద్యార్థులను చైతన్యవంతులను చేసే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. సైబర్ క్రైమ్ అంశాన్ని కూడా ఈ చిత్రంలో చూపించామన్నారు. ఇవాల్టి యూత్ చిత్రాల్లో ఇదొక సరికొత్త ట్రెండ్ సృష్టించే చిత్రమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో వివేక్, సోహెల్, జూనియర్ రేలంగి, మేల్కొటే, గుండు సుదర్శన్, లక్కింశెట్టి నాగేశ్వరరావు, హర్ష, అభిషేక్, అంబటి శ్రీనివాస్, కుంతి శ్రీనివాస్, జయశ్రీ, బేబి హరిణి, లక్ష్మీకాంతరావు తదితరులు నటించారు. శంకర్ కంతేటి సనిమాటోగ్రఫీ, బస్వా పైడిరెడ్డి ఎడిటింగ్, కార్తీక సంగీతం అందించారు. యశోధరాదేవి సమర్పకురాలు.
Be first to comment on this News / Article!
|