9న 'కందిరీగ' ప్రారంభం
'సింధూరం', 'ఖడ్గం' చిత్రాల తర్వాత రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి ఓ కొత్త చిత్రం సెట్స్ పైకి రాబోతోంది. ఈ చిత్రానికి 'కందిరీగ' అనే టైటిల్ నిశ్చయమైంది. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నాలుగు నెలల క్రితమే పూజా కార్యక్రమాలు జరుపుకొన్న ఈ చిత్రం జనవరి 9 నుంచి రెగ్యులర్ షూటింగ్ లో అడుగుపెట్టనుంది.
రవితేజ బాడీ లాంగ్వేజ్ కు దగ్గరగా పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని కృష్ణవంశీ తెరకెక్కించబోతున్నారు. 'మహాత్మ' వంటి సందేశాత్మక చిత్రం తర్వాత కృష్ణవంశీ దర్శకత్వం వహించనున్న చిత్రం ఇదే కావడం విశేషం. ఇందులో శ్రీకృష్ణదేవరాయలు వారసుడుగా రవితేజ నటించబోతున్నారు. ఆయనకు జోడిగా ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. త్వరలోనే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివారాలు వెల్లడించనున్నారు. రవితేజ ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ నిర్మాతగా సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందుతున్న 'శంభో శివ శంభో'లో నటిస్తున్నారు. 'కిక్' నిర్మాత వెంకట్ తో మరో చిత్రానికి కూడా కమిట్ అయ్యారు.
Be first to comment on this News / Article!
|