బొబ్బిలికోట సెట్ లో 'సింహా'
సింహం ఒకడుగు వెనక్కి వేసిందటే...వీరోచితంగా పదడుగులు ముందుకు దూకుతుందనే విధంగా బాలకృష్ణ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్న చిత్రం 'సింహా'. రెండు వరుస హిట్ల (లక్ష్మీ, తులసి) తర్వాత దర్శకుడు బోయపాడి శ్రీను హ్యాట్రిక్ ఫిల్మ్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన స్నేహ ఉల్లాల్, నమితతో పాటు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నయనతార నటిస్తోంది. హైద్రాబాద్ లో 'బొబ్బిలి కోట'ను పోలిన సెట్ వేసి రెండ్రోజుల క్రితం ఓ కీలక మైన ఫైట్ ను చిత్రీకరించారు. బాలకృష్ణ, మలయాళ నటుడు సాయికుమార్, కె.ఆర్.విజయ తదితరులు ఇందులో పాల్గొన్నారు. రామ్-లక్ష్మణ్ సోదరులు ఈ ఫైట్ కు కంపోజ్ చేశారు.
బాలకృష్ణ అభిమానుల అంచనాలకు మించి ఈ చిత్రం ఉంటుందనీ, ఆయన పాత్ర పవర్ ఫుల్ గా ఉంటూ పదునైన సంభాషణలు ఉంటాయని పరుచూరి కిరీటి చెప్పారు. ఫిబ్రవరి 10వ తేదీ వరకూ జరిగే తాజా షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుందని తెలిపారు. మరో మూడు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంటుందన్నారు. వీటిని ఫిబ్రవరి మాసంలోనే విదేశాల్లో ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఏప్రిల్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. బోయపాటి శ్రీను కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్థన్ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చక్రి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|