ఫిలిం చాంబర్ కు 'టి' సెగలు
నెలరోజులుగా జరిగిన పరిణాలను విశ్లేషించుకుంటే...మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్, హీరోలు అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ షూటింగ్ లపై తెలంగాణ ఉద్యమకారులు దాడులు జరిపారు. దీనిపై నటుడు, నిర్మాత మోహన్ బాబు, ప్రజారాజ్యం పార్టీ నాయకుడు అల్లు అరవింద్ సూటిగానే స్పందించారు. ప్రస్తుత పరిస్థితిని మౌన ప్రేక్షకునిలా చూడటం కాకుండా నిర్మాతలను ఆదుకునేందుకు ఎ.పి.ఫిల్మ్ ఛాంబర్ నడుం బిగించాలని వారు డిమాండ్ చేశారు. అయితే చాంబర్ సర్వసభ్య సమావేశం రెండుసార్లు రద్దు కావడంపై చాంబర్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానిస్తూ 'మీటింగ్ కు హాజరుకావాల్సన వారిలోనూ విభిన్న ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. ఎవరు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినా మరిన్ని బంద్ లకు దారితీసే అవకాశాలు లేకపోలేదు' అని అన్నారు. ఇటు తెలంగాణకు గానీ, అటు సమైక్ష ఆంధ్రకు అనుకూలంగా చాంబర్ నిర్ణయం తీసుకోలేకపోతోందనీ, ఇందుకు రకరకాల కారణాలున్నాయనీ పలువురు విశ్లేషిస్తున్నారు.
ఏటా అత్యధిక సినిమాలు నిర్మించే తెలుగు పరిశ్రమ ఈ ఏడాది సక్సెస్ ల పరంగా కూడా గడ్డు పరిస్థితి ఎదుర్కొంది. సుమారు 230 చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. వీటిలో కొన్ని అనువాద చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఐదారు చిత్రాలు మాత్రమే చెప్పుకోదగిని విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మహేష్ బాబు, నాగార్జున, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ నటించిన చిత్రాలేవీ ఈ ఏడాది వెలుగు చూడలేదు. ఈ క్రమంలో తెలంగాణ ఆందోళనల ప్రభావంతో విడుదలకు సిద్ధం చేసిన చిత్రాలను కూడా నిర్మాతలు బయట పడేయలేక భారీ నష్టాలను చవిచూస్తున్నారు. షూటింగ్ లను ఉద్యమకారులు అడ్డుకోవడం కూడా వారికి మరో ప్రధాన సమస్యగా మారుతోంది. 'ప్రస్తుత తరుణంలో నిర్మాతలు ఔట్ డోర్ కు వెళ్లకుండా సాధ్యమైనంత వరకు స్టూడియోస్ కే పరిమితం కావడం మంచిది' అని ఫిల్మ్ చాంబర్ ఉపాధ్యక్షుడు కె.రామసుబ్బా రెడ్డి ప్రస్తుత పరిస్థితిపై వ్యాఖ్యానించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|