2009: డీలాపడ్డ కొత్తదనం
కథానాయకులు
ఈ ఏడాది దాదాపు 20 మంది కొత్త హీరోలు పరిశ్రమకు పరిచయమైనప్పటికీ వారు కూడా విజయానికి చేరువకాలేకపోయారు. ప్రముఖ హీరో నాగార్జున తనయుడు నాగచైతన్య 'జోష్' చిత్రం ద్వారా పరిచయమయ్యారు. సందేశాల జోరు ఎక్కువ సారం తక్కవ అంటూ జనం ఆ సినిమాను తిప్పికొట్టారు. నారాచంద్రబాబు తమ్ముడి సోదరుడైన నారా రోహిత్ 'బాణం' చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు. సినిమా కంటెంట్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ ఈ చిత్రం ఆశించిన విజయాన్ని నమోదు చేసుకోలేకపోయింది. నెగిటివ్ పాత్రల ద్వారా సుపరిచితుడైన అజయ్ 'ఆ ఒక్కడు' తో హీరోగా మారారు. అయితే ఆ సినిమా చతికిలపడింది. నటుడు, ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు తనయుడు పరుచూరి రవీంద్రనాథ్ 'జంక్షన్' చిత్రంతోనూ, పవన్ 'నల్లబ్బాయ్ తెల్లమ్మాయ్', అరవిద్ '16 డేస్', స్కంద 'మళ్లీ మళ్లీ', యువన్ 'బీభత్సం', అదితి శ్రీనివాస్ 'నిర్ణయం' తోనూ హీరోలుగా పరిచయమైనప్పటికీ వీరెవరూ విజయాన్ని అందుకోలేకపోయారు.
కథానాయికలు
కొత్తమ్మాయిల జోరు ఈ ఏడాది కూడా ఎక్కవగానే ఉంది. అయితే దాదాపు ఎవరూ ఆశించినతంగా ఫోకస్ కాలేకపోయారు. సీనియర్ నటి రాధ కుమార్తె కార్తీక 'జోష్' చిత్రంతోనూ, బాలతారగా మంచి పేరు తెచ్చుకున్న షామిలి 'ఓయ్' ద్వారా హీరోయిన్లుగా పరిచయమయ్యారు. వీరుకున్న సినీనేపథ్యం ఆయా చిత్రాలపై ఎన్నో అంచనాలు రేకెత్తించినా బాక్సాఫీస్ వైఫల్యాలు తప్పలేదు. దీంతో కార్తీక, షామిలికి రెండో సినిమా రాలేదు. ఈ ఏడాది సరైన సక్సెస్ రాకపోయినా ఓ ముగ్గురు నలుగురికి మాత్రం మలి అవకాశాలు వచ్చాయి. మధురిమ 'మౌనరాగం' చిత్రంలోనూ, విమలారామన్ 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి' చిత్రంలోనూ నటిస్తున్నారు. 'ప్రయాణం' చిత్రంతో పరిచయమైన హారిక, 'విలేజ్ లో వినాయకుడు'లో నటించిన శరణ్యామోహన్ కు కొత్త చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. మిగిలిన కొత్త హీరోయిన్లకు మలి అవకాశాలు ఇప్పటికీ ఊరిస్తూనే ఉన్నాయి.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2
|