2009: హిట్స్ అండ్ ఫ్లాప్స్
సూపర్ ఫ్లాప్స్...
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలు చిత్రాలు ఆ అంచనాలను చేరుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. వాటిలో బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'మిత్రుడు', విష్ణు 'సలీమ్', నాగచైతన్య 'జోష్' వంటివి ఉన్నాయి. ఫ్లాపుల జాబితాలో అల్లరి నరేష్ 'ఫిట్టింగ్ మాస్టర్', మనోజ్ 'ప్రయాణం', రాజశేఖర్ 'నా స్టైలే వేరు', శ్రీహరి 'శ్రీశైలం', శ్రీకాంత్ 'అ ఆ ఇ ఈ', రామ్ 'గణేష్', విక్రమ్ 'మల్లన్న', వరుణ్ సందేష్ 'ఎవరైనా ఎపుడైనా', 'కుర్రాడు', నితిన్ 'రెచ్చిపో', 'ద్రోణ', సుమంత్ 'బోణి', కల్యాణ్ రామ్ 'జయీభవ', పోసాని 'రాజావారి చేపలచెరువు', 'జెంటిల్ మేన్', ఛార్మి 'కావ్యాస్ డైరీ' వంటివి ఉన్నాయి.
తమిళ అనువాద చిత్రాల్లో 'ఆకాశమంత', 'వ్యాపారి', 'అనంతరపురం' చిత్రాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చారు. వ్యాపారంపరంగానూ ఫరవైలేదనిపించాయి. చైనా చిత్రం 'నింగి నేల నాదే'కు మంచి ప్రశంసలు దక్కాయి. హాలీవుడ్ '2012' చిత్రం పలు తెలుగు చిత్రాల కలెక్షన్లను కూడా అధిగమించి ఆశ్చర్యపరచింది. జేమ్స్ కేమరన్ 'అవతార'కూ మంచి ఆదరణ లభించింది. ఓవరాల్ గా తీసుకుంటే...ఈ ఏడాది హిట్లు, యావరేజ్ లు ఓ పది శాతమే ఉండటం పరిశ్రమను డీలా పడేలా చేసింది. దీనికితోడు ఏడాది చివర్లో సినీ పరిశ్రమకు రాజకీయ ఆందోళనల తాకిడి తగలడంతో రిలీజ్ కు సిద్ధమైన పలు సినిమాలు గత్యంతరం లేని పరిస్థితులో వెనకబాట పట్టాయి. వీటిలో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉండటంతో పరిశ్రమకు మరింత కుదేలయింది. ఈ సంక్లిష్ట పరిస్థితి నుంచి పరిశ్రమ కోలుకుని 2010లో గణనీయమైన విజయాలను సొంతం చేసుకుంటుందని ఆశిద్దాం.

Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2
|