'నమో వెంకటేశ' ఆడియో
విక్టరీ వెంకటేష్, త్రిష జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన 'నమో వెంకటేశ' చిత్రంలోని ఓ పాట షూటింగ్ కోసం బ్యాంకాక్ కు వెళ్లిన చిత్ర యూనిట్ ఆక్కడే ఆడియో వేడుకను గ్రాండ్ గా జరిపింది. సురేష్ ప్రొడక్షన్స్ ఎంటర్ టైన్ మెంట్ లిమిటెడ్ డి.సురేష్ బాబు సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో సీడీని వెంకటేష్ ఆవిష్కరించి తొలి ప్రతిని త్రిషకు అందించారు.
వెంకటేష్ మాట్లాడుతూ, బ్యాంకాక్ లో ఆడియో రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉందనీ, దేవీశ్రీప్రసాద్ వండ్రఫుల్ మ్యూజిక్, రామజోగయ్యశాస్త్రి చక్కటి రిలిక్స్ రాశాననీ చెప్పారు. నమో నమో వెంకటేశ...సౌందర్యా సౌందర్యా...డింగ్ డాంగ్ వంటి పాటలన్నీ ఆకట్టుకుంటాయనీ చెప్పారు. ఐస్ లాండ్ లో ఎవరూ చేయని లొకేషన్ లో ఈ సాంగ్స్ చేశామనీ, అలాగే ఆస్ట్రియా, యూరప్, ఇప్పుడు బ్యాంకాక్ లో సాంగ్స్ చేస్తున్నామనీ చెప్పారు. శ్రీనువైట్ల ఎంటర్ టైన్ మెంట్ అంటే తనకెంతో ఇష్టమనీ, వండ్రఫుల్ సబ్జెక్ట్ తో ఈ సినిమా చేస్తున్నాడనీ చెప్పారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఆనందించేలా ఉంటుందన్నారు. అలాగే నిర్మాతలు, మా సురేష్ కలిసి ఆడియెన్స్ కు ఓ మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీస్తున్న ఈ చిత్రం తప్పకుండా అందికీ నచ్చుతుందన్నారు. తన ఇష్టదైవమైన వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఈ చిత్రానికి ఉంటాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. శ్రీనువైట్ల మాట్లాడుతూ, తన కెరీర్ లో మర్చిపోలేని సినిమా ఇదని అన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద సంస్థతో కలిసి తన మిత్రులు ఈ చిత్రాన్ని నిర్మించారనీ, వెంకటేష్ బాబు కామెడీ ఇందులో పీక్ లెవల్ లో ఉంటుందనీ చెప్పారు. త్రిష క్యారెక్టర్ మంచి ఎంటర్ టైనింగ్ గా ఉంటుందనీ, బ్రహ్మానందం ఇంతవరకూ ఇలాంటి క్యారెక్టర్ చేయలేదనీ చెప్పారు. దేవీశ్రీప్రసాద్ గతంలో తనతో పలు మ్యూజికల్ హిట్స్ చేసినా ఈ సినిమా మ్యూజిక్ వాటిన్నింటి కంటే బాగా వచ్చిందన్నారు. రామజోగయ్య శాస్త్రి ఈ సినిమా అంతా తమతోనే ట్రావెల్ చేసి సిట్యుయేషన్ పరంగా అన్ని సాంగ్స్ అద్భుతంగా రాశారని తెలిపారు. ఇది సంక్రాంతికి విందు భోజనం లాంటి సినిమా అవుతుందన్నారు. 'ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే' చిత్రంలో తాను చేసిన క్యారెక్టర్ కు పూర్తి కాంట్రాస్ట్ క్యారెక్టర్ ఇదని, నటిస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశాననీ త్రిష తెలిపింది. వెంకటేష్ తో తనకు ఇది మరో సూపర్ హిట్ చిత్రమవుతుందని అన్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియో జనవరి 6 నుంచి మార్కెట్ లో ఉంటుందనీ, సంక్రాంతి కానుకగా 14న భారీ ఎత్తున సినిమా రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నామనీ నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ అభిమానులు పలువురు పాల్గొనగా, భార్గవి వ్యాఖ్యాతగా వ్యవహరించింది.
Be first to comment on this News / Article!
|