'గుడుగుడుగుంజం' గిఫ్ట్ లు
గుప్పెట్లో నిజం దాచి 'గుడు గుడు గుంజం' ఆడటమే సంసారం అనే ఫ్యామిలీ బేస్డ్ ఎంటర్ టైనర్ గా సోమా విజయ ప్రకాష్ సమర్పణలో శ్రీచిత్ర వారి 'గుడు గుడు గుంజం' రూపొందుతోంది. జనవరి 10న ఆడియో, మూడో వారంలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్, కస్తూరి, పార్దు (నవదీప్ సోదరుడు), చాహత్ ఖన్నా, ఫరాఖాన్, రిథిమ, ఆర్తిపూరి తదితరులు నటిస్తున్నారు కె.వీరు దర్శకుడు.
'లేడీస్ టైలర్', 'ఏప్రిల్ 1 విడుదల' తర్వాత డాక్టర్ రాజేంద్రప్రసాద్ నటించిన ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ ఇదనీ, రాజేంద్రప్రసాద్-సితార కలిసి పాడిన 'ప్రేమించవా మళ్లీ పెళ్లాడవా', కస్తూరితో పాడిన 'నిన్నలా ఎప్పుడు' వంటి పాటలు మహిళా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనీ, డాక్టర్ బ్రహ్మానందం బ్యాంకాక్ లో చేసిన కామెడీ ట్రాక్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనీ నిర్మాత రవికుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆంధ్ర, నైజాం ఏరియా బిజినె పూర్తయిందనీ, ఇందుకు డిస్ట్రిబ్యూటర్ సోమా విజయప్రకాష్ కు తమ కృతజ్ఞతలనీ అన్నారు. రిలీజ్ కు అత్యంత భారీగా పబ్లిసిటీ చేస్తూ సినిమా టిక్కెట్లపై గిఫ్ట్ ల పంపిణీ కి కూడా కూడా ప్లాన్ చేశామని తెలిపారు. మొదటివారం సినిమా చూసిన పైక్లాస్ ప్రేక్షకులు, మల్టీప్లెక్స్, రిలీజయ్యే అన్ని ముఖ్య పట్టణాల్లోని మెయిన్ ధియేటర్లలో డ్రాలు, స్కీమ్ లు లేకుండానే కౌంటర్ వద్దే టిక్కెట్లతో పాటే గిఫ్ట్ లు అందిస్తామని చెప్పారు. ఆడియో రిలీజ్ రోజున బహుమతుల వివరాలు తెలియజేస్తామని అన్నారు. 'గుడు గుడు గుంజం డాట్ కామ్'ను ఈనెల 7న అఫీషియల్ గా లాంచ్ చేసి ఇందుకు సంబంధించిన వాల్ పేపర్స్, క్యాలెండర్స్, జోక్ బుక్స్, ట్రైలర్స్ వెబ్ సైట్ లో ఉంచుతామని సోమా విజయ ప్రకాష్ తెలిపారు. 10న సుప్రీం మ్యూజిక్ ద్వారా ఆడియో రీలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రానికి మరుధూరి రాజా-నంద్యాల హరి స్క్రీన్ ప్లే-మాటలు అందిస్తుండగా, కులశేఖర్-భాస్కరభట్ల-నిశ్చల్ పాటలు, నందమూరి హరి ఎడిటింగ్, కె.వీరు సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|