'యుగానికి ఒక్కడు' పాటలు
'పరుత్తి వీరన్' ఫేమ్ కార్తీ (సూర్య సోదరుడు), రీమాసేన్, ఆండ్రియా జెరోమియా ప్రధాన పాత్రల్లో శ్రీ రాఘువ దర్శకత్వంలో 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందించిన చిత్రం 'యుగానికి ఒక్కడు'. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆడియో రైట్స్ సోనీ కంపెనీ తీసుకుని ఈనెల 8న విడుదల చేయనుంది.
డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్ పతాకంపై రూపొందిన ఈ చిత్ర విశేషాలను సమర్పకుడు ఆర్.రవీంద్రన్ తెలియజేస్తూ, తెలుగు వెర్షన్ కు సంబంధించిన ఆడియో ఈనెల 8న విడుదల చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం రీరికార్డింగ్ పూర్తయి మిక్సింగ్ జరుగుతోందన్నారు. శ్రీ రాఘవ ఎంతో శ్రమించి ఈ చిత్రాన్ని సైంటిఫిక్ ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందించారనీ, అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుందని అన్నారు. తొలి కాపీ రాగానే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో పార్దీబన్, ప్రతాప్ పోతన్ తదితరులు నటించారు. శ్రీరామకృష్ణ మాటలు, భువనచంద్ర-అనంత శ్రీరామ్ మాటలు, రామ్ జీ సినిమాటోగ్రఫీ, కోలా భాస్కర్ ఎడిటింగ్, జి.వి.ప్రకాష్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|