ఆకాష్, థ్రిల్లర్ మంజు చిత్రం
ఆకాష్, గౌరీపండిట్, అయేషా హీరోహీరోయిన్లుగా థ్రిల్లర్ మంజు దర్శకత్వంలో సిగ్నస్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో థ్రిల్లర్ మంజు ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల బ్యాంకాక్ లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు, కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపిన యూనిట్ హైదారాబాద్ కు తిరిగొచ్చింది.
చిత్రం ప్రోగ్రస్ ను థ్రిల్లర్ మంజు వివరిస్తూ, కమర్షియల్ అంశాలతో కూడిన వినోదాత్మక చిత్రమిదనీ, బ్యాంకాక్ షెడ్యూల్ తర్వాత మళ్లీ హైదరబాద్ లో తదుపరి షెడ్యూల్ పది రోజుల పాటు ప్లాన్ చేశామనీ చెప్పారు. ఇందులో ఐదు పాటలు ఉన్నట్టు చెప్పారు. థ్లిల్లర్ మంజుకు ఫైట్ మాస్టార్ గానే కాకుండా దర్శకుడిగా కూడా ప్రత్యేకత ఉందనీ, ఆయన దర్శకత్వంలో యాక్షన్ చిత్రం చేస్తుండటం సంతోషంగా ఉందనీ ఆకాష్ తెలిపారు. ఈ చిత్రం తప్పకుండా తనకు యాక్షన్ హీరోగా మంచి ఇమేజ్ తెస్తుందన్నారు. ఇందులో ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాల్లో నటించినట్టు అయేషా పేర్కొనగా, ఈ చిత్రం తనకు మంచి పేరు తెస్తుందని మరో కథానాయిక గౌరీపండిట్ తెలిపింది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సూర్యనారాయణ, శ్రద్ధాశర్మ, అవినాష్, రమేష్ భట్, రేఖ, రవికుమార్, ఆర్.కె. తదితరులు నటిస్తున్నారు. వంశీ మాటలు, భాస్కరభట్ల పాటలు, రాయపాటి జనార్దన్ సినిమాటోగ్రఫీ, గోవర్ధన్ ఎడిటింగ్, ఎం.ఎన్.కృపాకర్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|