నవదీప్ 'ప్రేమించిన కొత్తలో'
నవదీప్, మల్లికా షరావత్, స్వప్నమాధురి, సజా హీరోహీరోయిన్లుగా హరి హర దర్శకత్వంలో పి.రామ్ నిర్మిస్తున్న చిత్రానికి 'ప్రేమించిన కొత్తలో' అనే టైటిల్ ను ఖరారు చేశారు.
ప్రేమించిన కొత్తలో ప్రేమ జంట అనుభవాలు ఎలా ఉంటాయనే కథాశంతో ఈ చిత్రం తెరక్కిందనీ, .ప్రేమకు, స్నేహానికి మధ్య ఉంటే వ్యత్యాసాన్ని కూడా ఈ చిత్రంలో చూపిస్తున్నామనీ నిర్మాత రామ్ వివరించారు. కథాశాంశానికి తగ్గ టైటిల్ ఇదని తెలిపారు. ఇందులో నవదీప్ పాత్ర ఎంతో హుషారుగా ఉంటుందని అన్నారు. ఆయన సరనన నలుగురు కథానాయికలు కనిపిస్తారనీ, ఆ సన్నివేశాలన్నీ రొమాంటిక్ గా ఉంటాయన్నారు. అలాగే పతాక సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని తెలిపారు. ప్రకాష్ రాజ్ నెగిటివ్ పాత్రలో పవర్ ఫుల్ నటన ప్రదర్శించగా, కొండవలస, గౌతంరాజు, సారిక రామచంద్రరావు ధ్య వచ్చే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని అందిస్తాయని అన్నారు. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో విజయ్ కుమార్, మీరాకృష్ణన్, సభా అలంఅరా, ఆశిష్ విద్యార్థి, అలెక్స్ తదితరులు నటించారు. మురళీ అబ్బాస్ కథ-స్క్రీన్ ప్లే అందించగా, జయ మాటలు, సత్య సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|