పల్లెటూరి 'బావ'
పల్లె నేపథ్యంలో ఓ అల్లరి కృష్ణుడు, అతని ప్రేమ భావనాలతో సాగే హృద్యమైన ప్రేమకథా ఇతివృత్తమే 'బావ'. యూత్ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న సిద్దార్ధ హీరో. అతని మరదలిగా ఓ కొత్తమ్మాయిని టాలీవుడ్ కు పరిచయం చేయనున్నారు. ఈ కొత్త చిత్రాన్ని సందీప్ సమర్పణలో శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్.కుమార్ చౌదరి నిర్మించనున్నారు. రాంబాబు దర్శకుడుగా పరిచయం కానున్నారు. ఆయన గతంలో కోడిరామకృష్ణ, ప్రభుదేవా వంటి పలువురి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం గడించారు.
చిత్ర విశేషాలను రాంబాబు తెలియజేస్తూ, పల్లెటూరి వాతావరణంలో సాగే అందమైన ప్రేమకథ ఇది. ప్రేమ, కుటుంబ విలువలు మిళితమైన పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా రూపొందించనున్నాం. సిద్దార్ధ తండ్రిగా ఓ ప్రముఖ కథానాయకుడు నటించనున్నారు. అలాగే అరవింద్ కృష్ణ ఛాయాగ్రహణం హైలైట్ గా ఉంటుందని అన్నారు. ఈ నెల 22న ప్రారంభోత్సవం జరిపి, ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. సిద్దార్ధ పాత్ర వైవిధ్యంగా ఉండి ఇటు క్లాస్ నూ, అటు మాస్ నూ ఆకట్టుకుంటుందని అన్నారు. ఈ చిత్రానికి చింతపల్లి రమణ మాటలు, గౌతంరాజు ఎడిటింగ్, చక్రి సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|