సంక్రాంతి కానుక 'అదుర్స్'
ఎన్టీఆర్ కథానాయకుడుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'అదుర్స్' చిత్రం భారీ అంచనాల మధ్య అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమైంది. కొడాలి శ్రీవెంకటేశ్వరరావు సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వల్లభనేని వంశీ మోహన్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు.
కొడాలి నాని ఆ విశేషాలను తెలియజేస్తూ, ఎన్టీఆర్-వినాయక్ కాంబినేషన్ లో రూపొందిన మరో సెన్సేషనల్ మూవీ 'అదుర్స్' అనీ, 'సాంబ' తర్వాత తమ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించామని చెప్పారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియో రిపీట్ ఆర్డర్స్ తో సూపర్ డూపర్ హిట్ అయిందన్నారు. సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ కు సిద్ధం చేశామని చెప్పారు. ఎన్టీఆర్ 'ఆది', 'సాంబ' చిత్రాల తర్వాత ఇది తమ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ ఫిలిం అవుతుందని వినాయక్ తెలిపారు. ఇందులో ఎన్టీఆర్ చేసిన రెండు పాత్రల్లో ఒక పాత్రను ఆయన మినహా ఎవరూ చేయలేరనీ, సంక్రాంతికి విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని అన్నారు. 'అదుర్స్' అనిపించుకునేలా ఈ చిత్రం సంక్రాంతికి విజయకేతనం ఎగురవేయనుందని నిర్మాత వంశీమోహన్ పేర్కొన్నారు. నయనతార, షీలా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో మహేష్ మంజ్రేకర్, సాయాజీ షిండే, నాజర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, రఘబాబు, తనికెళ్ల భరణి, రమాప్రభ తదితరులు నటించారు. కోన వెంకట్ కథ-మాటలు, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ, ఆనందసాయి ఆర్ట్ , స్టన్ శివ-రామ్ లక్ష్మణ్ ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్, దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|