కెవిరెడ్డి మాయాబజార్ రంగుల్లో
నిన్నటి 'జురాసిక్ పార్క్', 'టైటానిక్', ఈనాటి 'అవతార్' వంటి హాలీవుడ్ సినిమాలు చూసి ఆశ్చర్యపోతుంటాం. ఇలాంటి ఒక్క సినిమా మనం తీయగలమా అనుకుంటాం. కానీ ఇదే హాలీవుడ్ పరిశ్రమ 1957లో తెలుగు వారందరూ సగర్వంగా చెప్పుకునే 'మాయాబజార్' చిత్రాన్ని చూసి ముక్కున వేలేసుకుంది. కె.వి.రెడ్డి దర్శకత్వంలో నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన ది గ్రేట్ ఎథిక్ గా 'మాయాబజార్' చిత్రం సువర్ణాక్షరాలతో లిఖించ దగిన చరిత్రను సృష్టించింది. సాంకేతికపరంగానూ అత్యున్నతంగా నిలిచింది. సినిమాను అభిమానించే ప్రతి తెలుగువాడికి ఓ పది కలలు ఉంటే... 'మాయాబజార్ వంటి సినిమా మళ్లీ రావాలనే కల మొదటిది. ఆ కల ఇప్పుడు తీరనుంది. క్లాసిక్ 'మాయాబజార్' ఇప్పుడు కలర్ పుల్ గా ఇవాల్టి తరం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
బిఎన్ రెడ్డి సృష్టించిన 'మాయాబజార్' చిత్రాన్ని గోల్డ్ స్టోన్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థ ప్రేక్షకులకు అందిస్తోంది. భారీ ఖర్చుతో 3 ఏళ్లపాటు శ్రమించి దీనిని రంగుల్లో తీర్చిదిద్దారు. కలరైజేషన్ క్రియేటివ్ డైరెక్టర్ గా సి.జగన్ మోహన్ వ్యవహరించారు. తెలుగు ప్రేక్షకులు మెచ్చిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన సూపర్ గుడ్ ఫిలిం సంస్థ ఈ చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేయనుంది.
Be first to comment on this News / Article!
|