ఉషాకిరణ్ 'బెట్టింగ్ బంగార్రాజు'
పలు విజయవంతమైన చిత్రాలను అందించి ఇటీవల కాలంలో 'నచ్చావులే', 'నిన్ను కలిశాక' చిత్రాలను నిర్మించిన ఉషాకిరణ్ మూవీస్ లిమిటెడ్ సంస్థ మరో కొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. అల్లర్ నరేష్ కథానాయకుడుగా రామోజీరావు నిర్మిస్తున్న చిత్రానికి ఈ 'బెట్టింగ్ బంగార్రాజు' అనే టైటిల్ ఖరారు చేశారు. ఇ.సత్తిబాబు దర్శకుడు. అల్లరి నరేష్ కు జోడిగా ముంబై అమ్మాయి నిధి పరిచయమవుతోంది. ఈ చిత్రం ప్రచారార్భాటాలకు దూరంగా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.
అల్లరి నరేష్ కామెడీ చిత్రాల హీరోగా వరుస విజయాలు సొంతం చేసుకుంటుండగా, ఇ.సత్తిబాబు పలు కామెడీ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న 'బెట్టింగ్ బంగార్రాజు' పూర్తి నవ్వుల వినోదాన్ని అందించనుందని ఫిల్మ్ మేకర్స్ చెబుతున్నారు. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో చలపతిరావు, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, గిరిబాబు, ఎల్బీ శ్రీరామ్, కృష్ణభగవాన్, రఘబాబు, దువ్వాసి, మేల్కొటి, ప్రగతి, కల్పన, పూర్ణిమ, సన, సురేఖ వాణి, హేమ తదితరులు నటించారు. నాగరాజు గంధం మాటలు, అనంత్ శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి, కరుణమూర్తి ఛాయాగ్రహణం, విజయ్ ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్, శేఖర్ చంద్ర సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|