'కాస్కో' విజయానందం
వైభవ్, శ్వేతబసు ప్రసాద్ జంటగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కె.ఫిలిమ్స్ పతాకంపై ఎ.సునీల్ నిర్మించిన 'కాస్కో' చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఫిలించాంబర్ లో ఈ చిత్రం సక్సెస్ మీట్ నిర్వహించారు. వైభవ్, కోదండరామిరెడ్డి, ఎ.సునీల్, నాగేశ్వరరెడ్డి, చలపతిరావు, నటులు రాజేష్, అపూర్వ తదితరులు పాల్గొన్నారు.
తొలుత చలపతిరావు మాట్లాడుతూ, కోదండరామిరెడ్డి నటుడు కావాలనుకుని దర్శకుడయ్యారనీ, తన కొడుకు వైభవ్ ను హీరో చేశారనీ అన్నారు. తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న వైభవ్ తో దర్శకుడు నాగేశ్వరరెడ్డి యూత్ ఫుల్ చిత్రంగా 'కాస్కో'ను రూపొందించారని అన్నారు. ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుండటం ఆనందంగా ఉందన్నారు. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ, వైభవ్ చాలా బాగా చేశాడనీ, సినిమా బాగుందనీ, హీరోగా నిలబడ్డాడనీ అంతా చెబుతుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. సినిమా బాగుందని అందరూ అంటున్నా పలు కారణాల వల్ల రెవెన్యూ తగ్గిందన్నారు. మునుముందు సినిమా మంచి ఆదరణ చూరగొంటుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది తనకు శుభారంభం ఇచ్చిందనీ, డాన్స్ లు బాగా చేశావనీ, మంచి ఎనర్జీ చూపావనీ అందరూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారని పేర్కొన్నారు. పూర్తి వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రం మరింత మంచి సక్సెస్ ను సాధిస్తుందనే నమ్మకం తనకుందని అన్నారు. వైభవ్ తమిళంలో బిజీగా ఉండటం వల్ల ఈ చిత్రం సక్సెస్ మీట్ ను మూడు వారాల తర్వాత ఏర్పాటు చేయాల్సి వచ్చిందని నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. వైభవ్ బాడీలాంగ్వేజ్ కు అనుగుణంగా ఈ చిత్రాన్ని రూపొందించామనీ, అలాగే సినిమాలోని కామెడీని ప్రేక్షకులు బాగా రిసీప్ చేసుకుంటున్నారనీ అన్నారు. ఈ చిత్రానికి లభిస్తున్న ప్రేక్షకాదరరణ పట్ల రాజేష్, హేమ తదితరులు సంతోషం వ్యక్తం చేశారు.
Be first to comment on this News / Article!
|