సింధుమీనన్ లిప్ లాక్...
'భద్రాచలం', 'చందమామ' వంటి చిత్రాల్లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న సింధుమీనన్ ఇప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజీ అవుతోంది. ఆమె లీడ్ రోల్ పోషిస్తున్న'సుభద్ర' నిర్మాణంలో ఉంది. కాగా, సింధు కథానాయికగా ప్రేమలోని సున్నితమైన భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ రూపొందుతున్న మరో చిత్రం 'ప్రేమ పిలుస్తోంది'. శ్రీగణసాయి వెంకటేశ్వర మూవీస్ పతాకంపై ఎం.పవన్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ నాతారి దర్శకుడు. సింధుమీనన్ కు జోడిగా చంటి నటిస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటూ ఆడియో రిలీజ్ కు సిద్ధమైంది.
చిత్ర విశేషాలను నిర్మాత వివరిస్తూ, ప్రేమ కథల్లోనే ఇదొక వైవిధ్యమైన కోణమనీ, కథ-కథనాలే ఈ చిత్రానికి బలమనీ అన్నారు. యువతరాన్ని ఆకట్టుకునే విధంగా ఘంటాడి కృష్ణ చక్కటి ట్యూన్ అందించారనీ, ఈనెల 11న ఆడియో రిలీజ్ చేస్తున్నామనీ చెప్పారు. ప్రేమలోని భావోద్వేగాలను ఎంతో అందంగా ఇందులో చూపించామని, సింధుమీనన్ పాత్రతో పాటు, కథానాయకుడు చంటి పాత్ర హైలైట్ గా ఉంటుందనీ దర్శకుడు వివరించారు. ఈ చిత్రంలో హీరోహీరోయిన్లపై దర్శకుడు కళాత్మకంగా తెరకెక్కించినట్టు చెబుతున్న 'లిపి కిస్' సన్నివేశం పబ్లిసిటీ స్టిల్స్ రూపంలో ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, చంద్రమోహన్, వేణుమాధవ్, సుబ్బరాజు, జయప్రకాష్ రెడ్డి, రాజ్యలక్ష్మి, కొండవలస, చలపతిరావు తదితరులు నటించారు. మరుధూరి రాజా మాటలు అందించారు.
Be first to comment on this News / Article!
|