'నమో వెంకటేశ'కు తెర
విక్టరీ వెంకటేష్ కథానాయకుడుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'నమో వెంకటేశ' చిత్రం షూటింగ్ పూర్తయింది. సురేష్ ప్రొడక్షన్స్ ఎంటర్ టైన్ మెంట్ లిమిటెడ్ డి.సురేష్ బాబు సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రమిది. ఈనెల 4 నుంచి 7వ తేదీ వరకూ బ్యాంకాక్ లో వెంకటేష్-త్రిషలపై 'నీ కళ్లలో మెరిసింది ఓ నిజం...భూమ్మీదెలా ఇక నిలపడం..' అనే పల్లవితో సాగే పాటను చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తయినట్టు నిర్మాతలు తెలిపారు.
దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ, వెంకటేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేలా ఈ చిత్రం రూపొందిందని తెలిపారు. పూర్తి ఎంటర్ టైన్ మెంట్ తో కుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రంగా ఈ సంక్రాంతి కానుకగా 'నమో వెంకటేశ' వస్తోందన్నారు. దేవీశ్రీప్రసాద్ సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారనీ, వీటిని ఆస్ట్రియా, యూరప్, ఐస్ లాండ్, బ్యాంకాక్ లలో చాలా లావిష్ గా తీశామనీ తెలిపారు. అలాగే తన మిత్రులైన ఈ చిత్ర నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమా తీశారని అన్నారు. సంక్రాంతి కానుకగా ఈనెల 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బ్రహ్మానందం, ఆలీ, కోట శ్రీనివాసరావు, జె.పి., ఎం.ఎస్.నారాయణ, చంద్రమోహన్, ధర్మవరపు, ముఖేష్ రిషి, ,సుబ్బరాజు, శివారెడ్డి, మాస్టర్ భరత్, సుధ, ప్రగతి, సురేఖావాణి, తెలంగాణ శకుంతల తదితరులు నటించారు. గోపీమోహన్ కథ, చింతపల్లి రమణ మాటలు, రామజోగయ్య శాస్త్రి పాటలు, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ, విజయ్ ఫైట్స్, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|