'వీర్' ప్రమోషన్ కు సల్మాన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సుమారు ఓ ఇరవై ఏళ్ల క్రితం ఓ కథ రాసుకున్నారు. ప్రేమకోసం బ్రిటీష్ వారిని ఎదిరించిన ఓ మగధీరుడి కథ ఇది. దీన్ని సరిగా తెరకెక్కించే దర్శకుడి కోసం చాలాకాలంగా ఎదురుతెన్నులు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆయన నిరీక్షణ ఫలించి 'గదర్' ఫేమ్ అనిల్ శర్మ తారసపట్టారు. అంతే ఆ కథను ఆయన చేతిలో పెట్టారు. అలా తెరకెక్కిన చిత్రమే 'వీర్'. ఇందులో యుద్ధవీరుడుగా సల్మాన్ నటించగా, అతని సరసన జరీన్ ఖాన్ అనే నూతన నటి పరచయమవుతోంది. ఎరోస్ సంస్థ 55 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది.
యుద్ధవీరుడి పాత్ర కోసం సల్మాన్ ఎంతో శ్రమించి తన శరీరాకృతిని మలుచుకున్నారు. చిత్ర రచనలో కూడా సల్మాన్ పాల్గొన్నారు. చారిత్రక కథ కావడంతో సెట్స్ కు భారీగా ఖర్చుచేశారు. ఈ చిత్రంలో మిధున్ చక్రవర్తి, సోహైల్ ఖాన్, జాకీషరాఫ్ వంటి ప్రముఖ తారాగణం నటించారు. సాహిజ్ వాజిద్ స్వరపరచిని బాణీలకు ఇప్పటికే మంచి పాపులారిటీ లభించింది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం సల్మాన్ ఖాన్ హైదరాబాద్ రాబోతున్నారు.
Be first to comment on this News / Article!
|