కళ తప్పిన 'టి' టౌన్!
ఆగిన షూటింగ్ లు...
రాష్ట్రంలో జరుగుతున్నపలు పెద్ద చిత్రాలు షూటింగ్ లు ఇప్పటికే నిలిచిపోయాయి. వీటిలో అల్లు అర్జున్ కథానాయకుడుగా క్రిష్ ('గమ్యం' ఫేమ్) దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ 'వేదం' కూడా ఒకటి. 'వేదం' సినిమాతో పాటు సిద్దార్ధ నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం, రాజమౌళి దర్శకత్వంలో సునీల్ కథానాయకుడుగా నటిస్తున్న'మర్యాదరామన్న' షూటింగ్ లు నిలిచిపోయినట్టు నిర్మాత దేవినేని ప్రసాద్ తెలిపారు. రాబోయే రెండు వారాల్లో లెక్కలు మిక్కిలిగా చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో కొన్నింటి రిలీజ్ తేదీలను కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు సైతం తన కొత్త చిత్రం 'చండీ'ని ఫిబ్రవరికి నెట్టారు. పరిస్థితి మెరుగుపడాలని తాము కోరుకుంటున్నట్టు ఎం.ఎస్.రాజు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కథానాయకుడుగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రారంభం కావాల్సిన 'శక్తి' చిత్రం షూటింగ్ ఇటీవలే 'బృందావనం' యూనిట్ పై జరిగిన దాడిని దృష్టిలో పెట్టుకుని వాయిదా పడింది. ఎన్టీఆర్ ఇచ్చిన డేట్లు నిరుపయోగం కావడంతో షూటింగ్ ప్లాన్ మార్చుకోవాల్సి వచ్చిందని, ఫిబ్రవరి 5 నుంచి రాజస్థాన్ లో షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నామనీ మెహర్ రమేష్ తెలిపారు.
రెచ్చగొట్టద్దు...
రెచ్చగొట్టే రాజకీయ ప్రకటనలు ఇవ్వకుండా పరిశ్రమలోని వారంతా నిగ్రహం పాటించాలని తాను కోరుకుంటున్నట్టు దర్శకనిర్మాత తేజ ప్రస్తుత పరిస్థితులపై నిశితంగా విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని వినోదపరచేందుకే తామంతా ఇక్కడ ఉన్నామనీ, రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకోరాదనీ, అలాకాని పక్షంలో పరిశ్రమ ఆర్థికపరమైన గందరగోళంలో పడుతుందనీ ఆయన అన్నారు.అయితే పరిస్థితి ఆశాజనకంగానే ఉందని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విజయేంద్ర రెడ్డి ఊరట కలిగిస్తున్నారు.'యధావిధిగానే సినిమాలు రిలీజ్ అవుతాయి. తెలంగాణలోనూ మంచి రెవెన్యూ రాబట్టుకుంటాయి. నిర్మాతలు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు తమ సినిమాలను బీమా చేసుకుంటుకున్నారు. ప్రేక్షకులతో పాటు ఆందోళనకారులు కూడా సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను' అని ఆయన అన్నారు. ఆయన చెప్పినట్టే పరిస్థితులు పూర్తిగా చక్కబడి మళ్లీ తెలుగు సినిమా మూడు రిలీజ్ లు...ఆరు షూటింగ్ లతో కళకళలాడాలని టాలీవుడ్ కోరుకుంటోంది.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|