సౌత్ స్కోప్ క్యాలెండర్
తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ కు 'సౌత్ స్కోప్' మ్యాగజైన్ శ్రీకారం చుట్టింది. టాలీవుడ్ తారలతో 2010 న్యూ ఇయర్ క్యాలెండర్ ను తీసుకు వచ్చింది. దక్షిణాదికి చెందిన సినీ విశేషాలతో ఇటీవలే ఈ మ్యాగజైన్ ను ప్రారంభించిన అల్లు శిరీష్ ఆ వెనువెంటనే సౌత్ స్కోప్ సినీ అవార్డులతో సంచలం సృష్టించారు. తాజాగా 12 మంది టాలీవుడ్ తారలతో ఓ క్యాలెండర్ ను తీసుకు వచ్చిన తొలి దక్షిణాది సినీ మ్యాగజైన్ క్రెడిట్ ను ఆయన దక్కించుకున్నారు. ఈ క్యాలెండర్ ఇలియానా, శ్రియ, రీమాసేన్, బిందు మాధవి, దీక్షాసేత్, లక్ష్మీరాయ్, శియా గౌతమ్, అర్చన, క్రితి కర్బంద, నికిత, సింధూర గద్దె, మధుశాలిని, ముమైత్ ఖాన్ వంటి హాటెస్ట్ తారలు మోడలింగ్ చేశారు. హైద్రాబాద్ లోని తాజ్ డక్కన్ లో శుక్రవారం రాత్రి జరిపిన ఓ కార్యక్రమంలో ఈ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. మోడలింగ్ చేసిన పలువురు హీరోయిన్లతో ఈ కార్యక్రమం సందడిగా జరిగింది.
ఈ క్యాలెండర్ కు వెంకట్రాన్, రమాకాంత్, సునీల్ రుపాని ఫోటోగ్రాఫర్లుగా వ్యవహరించగా, నిశ్చయ్, శరణ్ లు స్టైలింగ్ చేశారు. మనోజ్ కుమార్ స్టార్ కో-ఆర్డినేటర్ గా వ్యవహరించారు. క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న తారలంతా తాము ఫోజులిచ్చిన ఫోటోగ్రాఫ్ లతో హొయలొలికిస్తూ 'న్యూ ఇయర్ విషెస్' చెప్పడం ప్రధాన హైలైట్ గా నిలిచింది.
Be first to comment on this News / Article!
|