'శంభో శివ శంభో' ప్లాటినం
రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ, సునీల్, ప్రియమణి, అభినయ ప్రధాన పాత్రధారులుగా శ్రీ సాయిగణేష ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మించిన తాజా చిత్రం 'శంభో శివ శంభో'. సముద్ర ఖని దర్శకుడు. సంక్రాంతి కానుగా ఈనెల 14న ఈ చిత్రం విడుదలవుతోంది. సుందర్ సి.బాబు సంగీతం అందించిన ఆడియో విశేషాదరణ చూరగొంటోంది. ఈ నేపథ్యంలో ప్లాటినం డిస్క్ వేడుక హైదారాబాద్ లో అంధ బాలల కోసం ఏర్పాటు చేసిన దేవనర్ ఫౌండేషన్ పాఠశాలలో ఆదివారం జరిగింది. సుందర్ సి.బాబు, బెల్లంకొండ సురేష్, జ్యోతిగౌడ్, సాయిబాబా గౌడ్, రవితేజ, సముద్రఖని, శివబాలాజీ, అభినయ తదితరులు పాల్గొన్నారు. దేవనార్ పౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ సాయిబాబా గౌడ్ చేతుల మీదుగా చిత్రయూనిట్ కు ప్లాటినం డిస్క్ ల ప్రదానం జరిగింది.
బెల్లంకొండ సురేష్ తమ పాఠశాలతో పెంచుకున్న అనుబంధం శ్లాఘనీయమనీ, ఆయన నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ సాయిబాబా గౌడ్ పేర్కొన్నారు. పిళ్లలూ దేవుళ్లూ సమానమనీ, అలాంటి అంధ బాలల సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందని సముద్రఖని పేర్కొన్నారు. ఈ సినిమా హీరోలు ఎక్కడో ఫైవ్ స్టార్ హోటలలోనే కాకుండా ఇక్కడకు రావడం వారి ఔన్నత్యాన్ని చాటుతుందని బెల్లంకొండ సురేష్ అన్నారు. ఆడియో మంచి సక్సెస్ అయిందనీ, సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందనీ ఆయన అన్నారు. దేవనార్ ఫౌండేషన్ కు బెల్లంకొండ చేస్తున్న సేవలు అభినందనీయమని, ఇక్కడ ఫంక్షన్ జరగడం సంతోషంగా ఉందనీ రవితేజ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మలినేని రత్తయ్య, మైనేని ప్రసాద్, సూర్య, చిన్నిచరణ్, ముత్తయ్య, కృష్ణభగవాన్, కిన్నెర, సునీల్, తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|