320 ప్రింట్లతో 'నమో వెంకటేశ'
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'కలిసుందాం రా', 'లక్ష్మీ' చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్ హిట్టయ్యాయి. వెంకటేష్, వరుస హిట్ చిత్రాల దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్ లో రూపొందిన 'నమో వెంకటేశ' చిత్రం సైతం సంక్రాంతి కానుకగా ఈనెల 14న విడుదలవుతోంది.
వెంకటేష్ మాట్లాడుతూ, సంక్రాంతికి విడుదలైన తన గత చిత్రాల తరహాలోనే ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం తనకుందని అన్నారు. ఈ సీజిన్ కు పెర్ ఫెక్ట్ సినిమా ఇదనీ, ఇందులో ఎంటర్ టైన్ మెంట్ తో పాటు రొమాన్స్, యాక్షన్, సెంటిమెంట్ వంటి అన్ని అంశాలు ఉన్నాయనీ చెప్పారు. నిర్మాతలు రాము, గోపి, అనిల్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తీశారనీ, త్రిష నటన, బ్రహ్మానందం క్యారెక్టర్, దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ హైలైట్స్ అవుతాయనీ అన్నారు. తనకెంతో ఇష్టమైన వెంకటేష్ బాబుతో తొలిసారి చేసిన సినిమా కావడం హ్యాపీగా ఉందని శ్రీనువైట్ల పేర్కొన్నారు. సంక్రాంతి పండుగకు ఓ విందు భోజనంలాంటి సినిమా ఇదని చెప్పారు. వెంకటేష్-శ్రీనువైట్ల కాంబినేషన్ అంటే అందరికీ మంచి అంచనాలుంటాయనీ, వాటికి ఏమాత్రం తీసిపోకుండా ఈ చిత్రం రూపొందిందని నిర్మాతలు తెలిపారు. ఆడియో సూపర్ హిట్ కావడంతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయన్నారు. 320 ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, చంద్రమోహన్, ధర్మవరపు, ముఖేష్ రిషి, సుబ్బరాజు, శివారెడ్డి, సుధ, సురేఖవాణి, తెలంగాణ శకుంతల తదితరులు నటించారు. గోపీమోహన్ కథ, చింతపల్లి రమణ మాటలు, రామజోగయ్ శాస్త్రి మాటలు, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ, విజయ్ ఫైట్స్, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|