'గుడు గుడు గుంజం' పాటలు
రాజేంద్రప్రసాద్, పార్దు (నవదీప్ సోదరుడు) ప్రధాన పాత్రల్లో శ్రీచిత్ర పతాకంపై వి.రవికుమార్ రెడ్డి నిర్మిస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ 'గుడు గుడు గుంజం'. వీరు దర్శకుడు. సంగీతం కూడా ఆయనే అందించారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలీసు అధికారి గోపీనాథ్ రెడ్డి ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించి రాజేంద్రప్రసాద్ కు అందించారు. ఆడియో సీడీని రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించి నవదీప్, పార్దులకు అదించారు. ప్రమోషన్ వర్క్ లో భాగంగా తయారుచేసిన క్యాలెండరన్ ను సూర్యకిరణ్, టీషర్డ్ లను చిత్ర సమర్పకుడు సోమా విజయప్రకాష్, కాపీ కప్స్ ను రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే కథాంశంతో వీరు ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ, కుటుంబ సమేతకంగా అందరూ చూసి హాయిగా నవ్వుకునే చిత్రమిదని అన్నారు. గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, రాజేంద్ర ప్రసాద్ సినిమాలో ఉన్నారంటే వినోదభరితంగా ఉంటుందని అనుకోవచ్చనీ, అలాగే వీరుకు ఈ చిత్రం మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాననీ అన్నారు. ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న తన తమ్ముడు పార్దును ప్రేక్షకులు ఆదరించాలని నవదీప్ కోరారు. ఇది వినోదాత్మక కథాంశంతో రూపొందిన చిత్రమనీ, రాజేంద్రప్రసాద్ ఎంతగానో సహకరించారనీ వీరూ పేర్కొన్నారు. హీరో రాజా, సోమా విజయప్రకాష్, కె.ఎస్.రామారావు, సాగర్ తదితరులు కూడా పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|