గోరటి వెంకన్న 'ధూం ధాం'
ప్రజాకవి గోరటి వెంకన్న ప్రత్యేక పాత్రలో డైలీ 4 షోస్ పతాకంపై రూపొందిన సందేశాత్మక చిత్రం 'ధూం ధాం'. శివానంద్ యాలాల దర్శకత్వంలో వై.వైవస్వత మను ఈ చిత్రాన్ని నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని సంక్రాంతి తర్వాత విడుదల చేయనున్నారు.
ఈ చిత్ర విశేషాలను వైవస్వత మను తెలియజేస్తూ, ఇందులో జర్నిలిస్టుగా తానొక కీలక పాత్రను పోషించినట్టు చెప్పారు. తెలంగాణ ప్రజల సమస్యను ఈ చిత్రంలో తెరకెక్కించామనీ, ఇందులో ప్రజాకవి గోరటి వెంకన్న పాడిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనీ అన్నారు. తెలంగాణ జిల్లాల్లో ఎన్నో స్టేజ్ షోల ద్వారా గీతాలను ఆలపించిన బేబి మధుప్రియ ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషించిందనీ, తెలంగాణ సాధన కోసం పారాడి మృతి చెందిన విద్యార్థులకు ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నామనీ పేర్కొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మాజీ, రఘనాధరెడ్డి, పద్మా జయంతి, రాంబాబు, వైజాగ్ లక్ష్మి తదితరులు నటించారు. ఈ చిత్రానికి రచన, సంగీతంకూడా శివానంద్ యాలాల అందించారు.
Be first to comment on this News / Article!
|