'ప్రేమ పిలుస్తోంది' ఆడియో
చంటి, సింధుమీనన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన ప్రేమ కథా చిత్రం 'ప్రేమ పిలుస్తోంది'. అజయ్ నాతారి దర్శకుడు. శ్రీ గణసాయి వెంకటేశ్వర మూవీస్ పతాకంపై లలిత సూర్యనారాయణ సమర్పణలో ఎం.పవన్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఆడియో వేడుక హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. రాజేంద్రనగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ ఆడియో సీడీని ఆవిష్కరించి 'మనపార్టీ' అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కు అందజేశారు. సుప్రీం మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
ఒక అబ్బాయి ప్రేమను ఒక అమ్మాయి ఎలా సాధించిందనే ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందిందనీ, ఘంటాడి కృష్ణ చక్కటి సంగీతం అందించారనీ లలిత సూర్యనారాయణ పేర్కొన్నారు. దర్శకుడిగా తనకు ఇది తొలి చిత్రమనీ, నిర్మాత చక్కటి సహకారం అందించారనీ అజయ్ నాతారి అన్నారు. నిర్మాత మాట్లాడుతూ, పద్మశ్రీ ఎస్.పి.బాలసుబ్రమణ్యం, బాబా సెహగల్, కుమార్ సాను వంటి మేటి నేపథ్యగాయకులు ఇందులోని పాటలు పాడారనీ, యూనిట్ అందరికీ ఈ చిత్రం మంచి పేరు తెస్తుందనీ అన్నారు. ఒక మంచి చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నందుకు సంతోషంగా ఉందని చంటి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి తులసీరామ్, మరుధూరి రాజా, నటులు చలపతిరావు, జయప్రకాష్ రెడ్డి, ఉప్పల్ బాలరాజు, నాగరాజు, నంది తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|