'సింహా' స్వైర విహారం
నందమూరి బాలకృష్ణ 'సింహా' చిత్రంతో మరోసారి విజృంభించబోతున్నారు. యూనైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకుడు. ఏప్రిల్ రిలీజ్ ప్లానింగ్ తో ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ 'ఈ చిత్రంలో బాలయ్య ఆంగికం, వాచికం, అభినయం కొత్తగా ఉంటాయి. ఓ కొత్త బాలయ్యను ఆడియెన్స్ చూస్తారు. బాలయ్య లుక్, బాడీ లాంగ్వేజ్, పెర్ ఫారమెన్స్ వినూత్నంగా ఉంటాయి. చక్రి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ప్రేమరక్షిత్ కొరియోగ్రఫీ, స్టన్ శివ-రామ్ లక్ష్మణ్ ల ఫైట్స్ అద్భుతంగా ఉంటాయి. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్.ప్రకాష్ ఈ చిత్రం కోసం భారీ సెట్స్ వేశారు.
బాలయ్య సరసన స్నేహ ఉల్లాల్, నమిత హీరోయిన్లుగా నటించారు. నయనతార చేసిన పాత్ర ఓ హైలైట్. ఆమె తప్ప ఇంకెవరూ ఆ పాత్రకు సూట్ అవరు. ఆ ముగ్గురికీ బాలయ్యబాబుతో రెండేసి పాటలు ఉంటారు. సెన్సేషన్ హిట్ కొట్టాలనే పట్టుదలతో నిర్మాత చక్కటి సహకారం అందిస్తున్నారు. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ లో సినిమా రిలీజ్ కు ప్లానింగ్ చేస్తున్నాం. దర్శకుడిగా భద్ర , తులసి తర్వాత ఇది నాకు హ్యాట్రిక్ ఫిలిం అవుతుంది' అన్నారు. పరుచూరి కిరీటి మాట్లాడుతూ, బాలయ్యబాబు కెరీర్ లో ఇది ఓ సెన్సేష్ ఫిలిం అవుతుందనీ, అలాంటి అద్భుతమైన స్క్రిప్టు కుదిరిందనీ అన్నారు. బాలయ్యబాబు నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి.మహేంద్రబాబు మాట్లాడుతూ, ఈనెల 20 వరకూ హైద్రాబాద్ లో, 21 నుంచి 25 వరకూ వైజాగ్ లో, 26 నుంచి ఫ్రిబ్రవరి 10 వరకూ మళ్లీ హైద్రాబాద్ లో జరిపే షెడ్యూల్స్ తో 3 పాటలు మినహా షూటింగ్ పూర్తవుతుందని చెప్పారు. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10వరకూ విదేశాల్లో ఈ పాటలు ప్లాన్ చేశామని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కె.ఆర్.విజయ, కిన్నెర, సన, ఝాన్సీ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఆలీ, కృష్ణభగవాన్, సాయికుమార్, హేమంత్ తదితరులు నటిస్తున్నారు. కథ-స్క్రీన్ ప్లే, మాటలు సైతం బోయపాటి శ్రీనివాస్ అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ధ్రర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|