'గాయం 2'లో విమలారామన్
'ఎవరైనా ఎపుడైనా', 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి' చిత్రాల కథానాయిక విమలరామన్ కు మరో మంచి అవకాశం దక్కింది.జగపతిబాబు కెరీరును మలుపుతిప్పిన 'గాయం' చిత్రానికి సీక్వెల్ గా ఆయనే హీరోగా రూపొందనున్న 'గాయం 2' చిత్రంలో కథానాయికగా విమలారామన్ ఎంపికైంది. కర్త క్రియేష్స్ పతాకంపై డాక్టర్ ధర్మకర్త సి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రవీణ్ శ్రీ దర్శకుడుగా పరిచయమవుతున్నారు.
చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ, 1993 లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'గాయం' చిత్రం జగపతిబాబుకు యాక్షన్ హీరోగా మంచి ఇమేజ్ తీసుకువచ్చిందనీ, ఆ సినిమాకు సీక్వెల్ చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందనీ అన్నారు. ఇది పెర్ ఫెక్ట్ సీక్వెల్ గా ఆయన అభివర్ణించారు. వర్మ శిష్యుడైన ప్రవీణ్ శ్రీ చాలా ఇన్నొవేటివ్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని, జగపతిబాబు ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించనున్నారనీ పేర్కొన్నారు. ప్రవీణ్ మాట్లాడుతూ, ఇళయరాజా స్వర సారథ్యంలో ఆరు పాటలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఈనెల 25 నుంచి విదేశాల్లో 20 రోజుల పాటు ఓ షెడ్యూల్ చేయనున్నామనీ, యాక్షన్ ఎపిసోడ్, కీలక సన్నివేశాలతో పాటు 2 పాటలను అక్కడ చిత్రీకరిస్తామనీ తెలిపారు. హైదరాబాద్, వైజాగ్ లలో తదుపరి షెడ్యూల్ చేస్తామని చెప్పారు. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, కోట ప్రసాద్ తదితరులు నటించనున్నారు. గంధం నాగరాజు మాటలు, అనిల్ భండారి సినిమాటోగ్రఫీ, ప్రవీణ ఎడిటింగ్ అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|