'వీర్' క్రెడిట్ హైదరాబాద్ కే..
తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'వీర్' ప్రమోషన్ వర్క్ హైదరాబాద్ నుంచే ప్రారంభించాననీ, సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించినా ఆ క్రెడిట్ హైదరాబాద్ కే దక్కుతుందనీ చిత్ర కథనాయకుడు, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. సల్మాన్, జెరీన్ ఖాన్ (తొలి పరిచయం) ప్రధాన పాత్రధారులుగా 'గదర్' ఫేమ్ అనిల్ శర్మ దర్శకత్వంలో 55 కోట్ల భారీ బడ్జెట్ తో ఎరోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. హిందీతో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లో ఈనెల 22న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ప్రమోషన్ వర్క్ లో భాగంగా శనివారంనాడు ప్రసాద్ మల్టీప్లెక్స్ లో జరిగిన కార్యక్రమంలో సల్మాన్, జెరీన్ ఖాన్, చిత్రయూనిట్ పాల్గొన్నారు. సల్మాన్ వచ్చినట్టు తెలియడంతో వేలాది మంది అభిమానులు ఆయనను చూసేందుకు ఐమాక్స్ కు చేరుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. నిర్వాహకుల ఏర్పాటు అరకొరగా ఉండటంతో అభిమానుల తోపులాటలో థియేటర్ స్టెయిర్ కేస్ వద్ద ఉన్న అద్దాలు, బయట ఉన్న పూలకుండీలు పగిలిపోయాయి. ముగ్గురు అభిమానులు కూడా గాయపడ్డారు.
సల్మాన్ ఖాన్ అంతకుముందు మాట్లాడుతూ, తనకు పెద్ద సక్సెస్ ఇచ్చిన 'వాంటెడ్' చిత్రం షూటింగ్ కోసం గతంలో హైదరాబాద్ వచ్చాననీ, ఇక్కడ వాతావరణం చూస్తే చాలా ముచ్చట వేస్తుందనీ అన్నారు. 'వీర్' చిత్రం ప్రమోషన్ వర్క్ కూడా ఇక్కడ్నించే ప్రారంభించామనీ, సినిమా బ్రహ్మాండంగా ఆడితే ఆ క్రెడిట్ హైద్రాబాద్ కే దక్కుతుందనీ అన్నారు. సినీ ప్రపంచంలో ఈ చిత్రం సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుందనే గట్టి నమ్మకం తనకుందన్నారు. సల్మాన్ తో ఇలాంటి మంచి చిత్రంలో చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు జెరీన్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రేమ కోసం బ్రిటీష్ వారిని ఎదిరించిన ఓ మగధీరుడి కథే 'వీర్'. ఇరవై ఏళ్ల క్రితం సల్మాన్ ఖాన్ ఈ కథ రాసుకున్నారు. చారిత్రక కథ కావడంతో సెట్స్ కు భారీగా ఖర్చు చేశారు. మిధున్ చక్రవర్తి, సోహైల్ ఖాన్, జాకీషరాఫ్ వంటి ప్రముఖ తారాగణం నటించారు. సాహిద్ వాజిద్ స్వర పరచిన బాణీలకు ఇప్పటికే మంచి పాపులారిటీ లభించింది.
Be first to comment on this News / Article!
|