'వరుడు'కు భారీ గ్రాఫిక్స్
అల్లు అర్జున్ కథానాయకుడుగా నటిస్తున్న 'వరుడు' చిత్రం ప్రోగ్రస్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. గుణశేఖర్ దర్శకుడిగా యూనివర్శల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మరింత భారీతనం తెచ్చి, ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు ప్రస్తుతం కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది. 2.75 కోట్ల భారీ ఖర్చుతో సత్యం నిపుణ సంస్థ కు ఈ గ్రాఫిక్స్ వర్క్ ను అప్పగించారు.
ఒక పెళ్లి చుట్టూ తిరిగే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో అల్లు అర్జున్ కు జోడిగా కొత్తమ్మాయి పరిచయం అవుతుండగా, తమిళ హీరో ఆర్య విలన్ గా నటిస్తున్నారు. మరో కీలక పాత్రను సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పోషిస్తున్నారు. నిజ జీవితంలోని వంద కుటుంబాలు తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఈ చిత్రంలో నటించడం విశేషం. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలోని అన్ని పాటలను వేటూరి సుందర రామమూర్తి రాశారు. ఇతర పాత్రల్లో నరేష్, సుహాసిని, సాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వినయ్ ప్రసాద్ తదితరులు నటించారు. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, స్టన్ శివ ఫైట్స్, అశోక్ ఆర్ట్, ఆంధోని ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది.
Be first to comment on this News / Article!
|