'రాయలసీమ ఎక్స్ ప్రెస్'
రాయలసీమ ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలయం. ఎందోర మహామహులు ఈ గడ్డపై పుట్టారు. అలాంటి రాయలసీమకు ఫ్యాక్షనిజం వల్ల కలుగుతున్న నష్టాన్ని వివరిస్తూ రూపొందించిన చిత్రం 'రాయలసీమ ఎక్స్ ప్రెస్'. దీనికి 'నో వే టు లవ్' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. మను, శ్వేత, ప్రియారెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని శ్రీ స్వామి కృప క్రియేషన్స్ పతాకంపై నాయుడు దివాకర్ చంద్రమణి, కొట్టెం రామలక్ష్మారెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ప్రసాద్ నక్కుళ్ల దర్శకుడు.
వినోదంతో పాటు ఉత్కంఠ కలిగించే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు దర్శకుడు తెలిపారు. చిత్ర నిర్మాణం పూర్తయిందనీ, సెన్సార్ కార్యక్రమాలుపూర్తి చేసి త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామనీ నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో తెలంగాణ శకుంతల, వైజాగ్ ప్రసాద్, మల్లాది రాఘువ, గీతాసింగ్, రామ్ జగన్, బబ్లూ తదితరులు నటించారు. ధరణి కోటి శివరామ ప్రసాద్ మాటలు, ఈశ్వర్ ఎన్ సినిమాటోగ్రఫీ, పులి అమృత్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|