వెంకయ్య విగ్రహావిష్కరణ
తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య గౌరవార్ధం ఫిల్మ్ నగర్ లో ప్రతిష్ఠించిన ఆయన నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి కె.రోశయ్య ఆదివారం ఉదయం ఆవిష్కరించారు. పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి డాక్టర్ జె.గీతారెడ్డి, దాదాసాహెబ్ ఫాల్కో అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, డాక్టర్ డి.రామానాయుడు, ఎం.ఎస్.రెడ్డి, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, తమ్మారెడ్డి భరద్వాజ, శ్రీమతి జమున, సి.కృష్ణవేణి, కె.సి.శేఖర్ బాబు, కె.బి.తిలక్, డివిఎస్ రాజు, వి.వి.బాలకృష్ణారావు, ఎం.శ్యాంప్రసాద్ రెడ్డి, ఆహుతి ప్రసాద్, కోటగిరి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొటర్ కాజ సూర్యనారాయణ, డాక్టర్ కె.ఎల్.నారాయణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడుతూ, పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ ప్రాత: స్మరణీయుడు రఘపతి వెంకయ్య అనీ, ప్రముఖ శిల్పి దేవికారాణి వుడయార్ తో డాక్టర్ డి.రామానాయుడు ఈ విగ్రహాన్ని రూపొందించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి విగ్రహాలు చూసినప్పుడైనా నాగయ్య, వెంకయ్య ఎవరనేది తరతరాల వారు తెలుసుకునే వీలుంటుందన్నారు. చిత్ర పరిశ్రమ హైద్రాబాద్ రావడానికి, నిలదొక్కుకోవడానికీ కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదట్నించీ చేయూతనిస్తున్నాయని ఆయన పునరుద్ఘాటించారు. రఘపతి వెంకయ్య అవార్డుతో పాటు పరిశ్రమకు ఎంతో సేవచేసిన నాగిరెడ్డి, చక్రపాణి, బిఎన్ రెడ్డి పేరిట అవార్డులు నెలకొల్పామనీ, నగదు బహుమతిని 2 లక్షలకు పెంచామనీ గీతారెడ్డి పేర్కొన్నారు. వెంకయ్య విగ్రహాన్ని ఎప్పుడో ఆవిష్కరించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికైనా జరిగినందుకు సంతోషంగా ఉందని అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. వెంకయ్య పేరిట అవార్డు ఏర్పాటు చేయాలని గుర్తు చేసి వ్యాసాలతో ప్రభుత్వంపై వత్తిడి తెచ్చిన ఘనత సీనియర్ పాత్రికేయుడు ఇంటూరి వెంకటేశ్వరరావుకు దక్కుతుందన్నారు. 1909లో సీనీ పరశ్రమకు పునాది వేసి, దక్షిణ భారతదేశంలోనే తొలి సినిమా థేయేటర్ గెయిటీని మద్రాసులో ఏర్పాటు చేసిన ఘనత వెంకయ్యదేనని డీవిఎస్ రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలైన తమ్మారెడ్డి కృష్ణమూర్తి, ఎమ్మెస్ రెడ్డి, సి.కృష్ణవేణిలను సన్మానించారు.
Be first to comment on this News / Article!
|