నేపథ్యగాయనిగా ముమైత్
'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' పాటతో హాటెస్ట్ ఐటెం గాళ్ గా మారిని ముమైత్ ఖాన్ అప్పట్నించి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంతకుముందు ముమైత్ ఒకటి రెండు చిత్రాల్లో ఐటెం గాళ్ గా చేసినప్పటికీ 'పోకిరి' చిత్రంతో దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆమెకు సరైన బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత ముమైత్ ఐటెం గాళ్ గానే కాకుండా 'ఆపరేషన్ దుర్యోధన' చిత్రంలో ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. 'మైసమ్మ ఐపిఎస్', 'మంగతాయారు ఐపిఎస్', 'పున్నమినాగు' చిత్రాల్లో టైటిల్ రోల్స్ పోషించింది. అయితే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు సక్సెస్ కాకపోవడం, ఐటెం గాళ్స్ కాంపటీషన్ పెరగడంతో ముమైత్ కొద్దిగా వెనకబడింది. ఈ తరుణంలో పూరీ జగన్నాథ్ మళ్లీ ఇటీవల 'నేనింతే' చిత్రంలో నిజ జీవిత పాత్రనే (నటిగా) ముమైత్ చేత చేయించారు. తాజాగా పూరీ జగన్నాథ్ 'గోలీమార్' చిత్రం కోసం ముమైత్ సింగర్ అవతారం కూడా ఎత్తడం విశేషం.
గోపీచంద్, ప్రియమణి జంటగా 'గోలీమార్' చిత్రాన్ని పూరీ జగన్నాథ్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం ముమైత్ చేత ఇటీవల ఓ పాటను కూడా పాడించారు. కొత్తతరం హీరోయిన్లలో మమతా మోహన్ దాస్ మాత్రమే గాయనిగా కూడా ప్రూవ్ చేసుకోగా, ఇప్పుడు ముమైత్ సైతం సింగర్ గా రాణించాలని తాపత్రయపడుతోంది. ఇక నుంచి బయట తారలకు కూడా ముమైత్ పాడుతుందా, మమతలా సొంతానికే పరిమితమవుతుందా అనేది చూడాల్సిందే.
Be first to comment on this News / Article!
|