మహేష్ తో సోనమ్ కపూర్
హీరో మహేష్ బాబు, దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్ లో తొలి చిత్రానికి శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని 14 రీల్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట, అనిల్ సుంకర కలిసి నిర్మించబోతున్నారు. ఇదే బ్యానర్ పై శ్రీనువైట్ల దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ వన్ గా రూపొందిన 'నమో వెంకటేశ' చిత్రం ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకాదరణ చూరగొంటోంది. ఈ తరుణంలో మహేష్ హీరోగా సంస్థ రెండో చిత్రాన్ని ఫిబ్రవరిలో సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లానింగ్ జరుగుతోంది. .
మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇంకా పేరుపెట్టని ఈ చిత్రం తుది మెరుగుల దశలో ఉంది. కాగా, శ్రీనువైట్ల చెప్పిన కథ నచ్చి ఈ చిత్రాన్ని అంగీకరించినట్టు ఇటీవల మహేష్ ప్రకటించారు. యాక్షన్, రొమాన్స్, ఎంటర్ టైన్ మెంట్ ప్రథానంగా సాగే ప్రేమ కథా ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని శ్రీనువైట్ల తెరకెక్కించనున్నారు. సినిమా ప్రథమార్థం ఉత్తర భారతదేశంలో షూటింగ్ చేయనున్నారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా హిందీ నటి సోనమ్ కపూర్ ను ఒప్పించేందుకు శ్రీనువైట్ల ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అనిల్ కపూర్ కుమార్తె అయిన సోనమ్ కపూర్ 'సావరియా', 'ఢిల్లీ 6' వంటి చిత్రాలలో పాపులర్ అయింది. ప్రస్తుతం కరణ్ జోహర్ తదుపరి చిత్రానికి కూడా కమిట్ అయింది.
Be first to comment on this News / Article!
|