ఎన్టీఆర్, బన్నీ ఫ్రెండ్స్: షీలా
మలయాళ ముద్దుగుమ్మ షీలా ఇంకెంతమాత్రం 'గర్ల్ నెక్స్ట్ డోర్' ఇమేజ్ ను కొనసాగించాలని అనుకోవడం లేదు. 'సీతాకోక చిలుక', 'పరుగు' చిత్రాలతో వచ్చిన ఇమేజ్ నుంచి ఇప్పుడు ఆల్ట్రా మోడ్రన్ గాళ్ గా అవతార మెత్తింది. 'అదుర్స్' చిత్రంలో ఆధునిక యువతిగా యూత్ ను తన గ్లామర్ తో ఆకట్టుకున్న షీలా ఇక ముందు కూడా ఈ తరహా పాత్రలకే తాను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానంటోంది.
'అదుర్స్'లో నయనతార ఉందని తెలిసినప్పుడు విలేజ్ అమ్మాయిలా కాకుండా గ్లామర్ పాత్ర పోషించాలని అనుకోవడంతో ఆ తరహా పాత్ర తనను వరించిందని షీలా చెప్పుకొచ్చింది. 'మోడ్రన్ గాళ్ పాత్ర దక్కిన తర్వాత అసలు పరీక్ష మొదలైంది. ఎన్టీఆర్ తో సమానంగా స్టెప్ట్ వేయాల్సి ఉంది. మొదట్లో కొంచెం భయపడ్డాను. అయితే నాలోని బెరుకును ఎన్టీఆర్ పోగొట్టి ప్రోత్సహించారు. ఎన్టీఆర్ కు ఈమధ్యనే ఓ ప్రమాదంలో వీపు మీద బలమైన గాయం అయింది. అయినప్పటికీ ఎన్టీఆర్ మతిపోగొట్టే స్టెప్స్ వేసి తన సత్తా చాటుకున్నారు' అంటూ ఎంతో ఎగ్జయిట్ అయింది షీలా. 'అదుర్స్' తర్వాత లెక్కకుమించిన ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయనీ, మొత్తం 10 ఆఫర్లలో ఒక సినిమా ఒప్పుకున్నాననీ, ఓ ప్రముఖ స్టార్ హీరో సరసన ఇందులో నటిస్తున్నాననీ ఆమె తెలిపింది. ప్రస్తుతం రెండు పదుల వయసులో ఉన్న తనకు హడావిడిగా సినిమాలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదనీ, కేవలం డబ్బు సంపాదించాలని కాకుండా ఒక గొప్ప నటిగా మిగిలిపోవాలన్నదే తన కోరిక అనీ చెప్పుకొచ్చింది. వ్యక్తిగతంగా తాను పార్టీ పక్షిని కాననీ, సన్నిహిత మిత్రులతో పార్టీలకు వెళ్తుంటాననీ, కొలీగ్స్ తో మాత్రమే తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటాననీ తెలిపింది. మరి అల్లు అర్జున్, ఎన్టీఆర్ ల మాటో అని అడిగినప్పుడు 'మంచి మిత్రులు మాత్రమే' అంటూ నవ్వులు చిందించింది షీలా.
Be first to comment on this News / Article!
|