'శంభో శివ శంభో' సక్సెస్
రవితేజ కెరీర్ లోనే కాకుండా, తనకు పేరు, డబ్బు తెచ్చిపెట్టిన చిత్రం 'శంభోశివ శంభో' అనీ, మంచి ఓపినింగ్స్ రావడం సంతోషంగా ఉందనీ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలిపారు. రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ, ప్రియమణి, అభినయ ప్రధాన పాత్రధారులుగా సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైన ప్రేక్షకాదరణ చూరగొంటోంది.ఈ నేపథ్యంలో హైద్రాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో సోమవారంనాడు ఈ చిత్రం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.
నిర్మాతగా తనకు ఈ చిత్రం పునర్జన్మ నిచ్చిందనీ, పేరూ, డబ్బూ రెండూ వచ్చాయనీ బెల్లంకొండ సురేష్ పేర్కొన్నారు. సముద్రఖని, అభినయ, సుంద్ సి.బాబుతో సహా యూనిట్ సభ్యులందరికీ సన్మానం చేయనున్నట్టు తెలిపారు. రవితేజ మాట్లాడుతూ, ఇంత మంచి ఓపినింగ్స్ కు కారకులైన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నానని అన్నారు. గతంలో తాను నటించిన 'నా ఆటోగ్రాఫ్'చిత్రానికి కూడా ఈ తరహాలోనే మంచి ప్రశంసలు వచ్చాయని అన్నారు. ఒక మంచి చిత్రంలో నటించే అవకాశం రావడం, ప్రేక్షకులు ఆదరిస్తుండటం సంతోషంగా ఉందని అల్లరి నరేష్, శివబాలాజీ పేర్కొన్నారు. సముద్రఖని, పలువురు యూనిట్ సభ్యులు ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|