రాజా కొత్తచిత్రం ప్రారంభం
రాజా, సంచిత పదుకునే (తొలి పరిచయం) జంటగా జయకృష్ణ క్రియేషన్స్ పతాకంపై సి.గోపాలకృష్ణ నిర్మిస్తున్న చిత్రం హైద్రాబాద్ లో ప్రారంభమైంది. శ్రీనివాస్ బళ్లాపురం దర్శకుడు. హీరోహీరోయిన్ల జంటపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి జెవికె ఇండస్ట్రీస్ ఎం.డి. కార్తీక్ క్లాప్ ఇవ్వగా, పారిశ్రామికవేత్త కిషోర్ కుమార్ రెడ్డి స్విచ్చాన్ చేశారు.
రెండు సంవత్సరాల క్రితం హైద్రాబాద్ లో జరిగిన ఓ ఎన్నారై ప్రేమకథతో ఈ చిత్రం రూపొందుతోందనీ, ఇదొక పరిణతి చెందిన ప్రేమకథ అనీ దర్శకుడు తెలిపారు. వెంగి విఠల్ మంచి సంగీతాన్ని అందిస్తున్నారని చెప్పారు. మూడు షెడ్యూల్స్ లో ఈ చిత్రం పూర్తవుతుందని నిర్మాత గోపాలకృష్ణ తెలిపారు. తొలి షెడ్యూల్ ఈరోజు నుంచి పదహారు రోజుల పాటు హైద్రాబాద్ లో జరుగుతుందన్నారు. పాటలు విదేశాల్లో ప్లాన్ చేస్తున్నానీ, మే నెలలో రిలీజ్ ఉంటుందనీ ఎగ్జిక్యూటివ్ నిర్మాత సాయికృష్ణ తెలిపారు. నటిగా తనకు ఇది నాలుగో చిత్రమనీ, తెలుగులో మొదటి సారి నటిస్తున్నాననీ సంచిత పేర్కొంది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చలపతిరావు, బాలయ్య, శ్రీనివాసరెడ్డి, ఉత్తేజ్, సుధ, జెన్నీ, ఎ.ఆర్.సి.బాబు తదితరులు నటించనున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం శ్రీనివాస్ బళ్లాపురం అందిస్తున్న ఈ చిత్రానికి వేటూరి-వెంగి పాటలు, ఎం.జోషి సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|