నిట్ క్యాప్ మీడియా ప్రేమకథ
నిట్ క్యాప్ మీడియా క్రియేషన్స్ సంస్థ నూతన తారలతో ఓ కొత్త చిత్రాన్ని ప్రారంభించింది. సింహాశ్రీ మిద్దె దర్శకత్వంలో శ్రీను కశ్యప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో సోమవారంనాడు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్తం నన్నివేశానికి పిసిసి మాజీ కార్యదర్శి రామమోహన్ రెడ్డి క్లాప్ ఇవ్వగా, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు సత్యం బెల్లంకొండ గౌరవ దర్శకత్వం వహించారు.
దర్శకుడు సింహాశ్రీ మిద్దె మాట్లాడుతూ, దర్శకత్వ శాఖలో అనుభవం గడించిన తనకు దర్శకుడిగా ఇది తొలి చిత్రమనీ, కుటుంబ సమేతంగా చూడదగిన ప్రేమకథా ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందనుందనీ తెలిపారు. ఈ చిత్రం ద్వారా ప్రతిష్ట, సుజాత హీరోయిన్లుగా పరిచయమవుతున్నారనీ, హీరో ఎంపిక జరుగుతోందనీ నిర్మాత శ్రీను కశ్యప్ తెలిపారు. ఫ్రిబవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందన్నారు. మంచి కథాబలం ఉన్న చిత్రంలో నటిస్తుండటం ఆనందంగా ఉందని ప్రతిష్ట చెప్పగా, తమిళ చిత్రాల్లో నటించిన తనకు తెలుగులో తొలి చిత్రమని సుజాత పేర్కొంది. సాహిత్య విలువలతో కూడిన పాటలు ఇందులో ఉంటాయని సంగీత దర్శకుడు బంటి తెలిపారు. ఈ చిత్రంలో నటిస్తున్న ఢిల్లీ రాజేశ్వరి, బెంగుళూరు పద్మ, కె.కె.శర్మ, జెన్నీ, గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో శరత్ బాబు, సూర్య, యమున, కవిత సైతం నటించనున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం సింహాశ్రీ మిద్దె అందిస్తున్న ఈ చిత్రానికి రామ్ పొన్నాడ సినిమాటోగ్రఫీ, నాగిరెడ్డి ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|