'అదుర్స్' యూనిట్ సంబరం
ఎన్టీఆర్ మాట్లాడుతూ, అదుర్స్ సినిమాకు ముందు తాను చేసిన సినిమాలన్నీ పోయిన జన్మలో వచ్చినట్టుగా భావిస్తున్నాననీ, ప్రమాదం జరిగిన తర్వాత మళ్లీ సొంతకాళ్ల మీద నిలబడగలనని అనుకోలేదనీ అన్నారు. ఎప్పుడెప్పుడు అదుర్స్ పూర్తవుతుందా, జనం ముందుకు వస్తానా అని పరితపించిపోయాననీ, అందుకు తగ్గట్టే సినిమాను ప్రేక్షకులు తన కెరీర్ లోనే గొప్ప హిట్ చేశారనీ అన్నారు. తల్లులు వేరైనా వినాయక్ తన సోదరుడులాండి వాడనీ, ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్లందరికీ పేరుపేరునా తన కృతజ్ఞతలనీ అన్నారు. ఎన్టీఆర్ తనను మించిపోయి నటించినట్టు బ్రహ్మానందం చెప్పడాన్ని వారి ఆశీస్సులుగా భావిస్తున్నాననీ, నిజానికి బ్రహ్మానందంను డామినేట్ చేయడం ఎవరి వల్లా కాదనీ అన్నారు. నిర్మాత వంశీ మట్లాడుతూ, ఎన్టీఆర్ అనే మూడక్షరాలలోనే చాలా పవర్ ఉందని అన్నారు. తొలుత ఈ చిత్రం టైటిల్ తనకు పెద్దగా నచ్చనప్పటికీ పాత్రికేయులు ఇదే టైటిల్ తో ముందుకు వెళ్లాలని చెప్పడం, అలాగే తమకు అది లక్కీ టైటిల్ కావడం సంతోషంగా ఉందన్నారు. పెద్ద ఎన్టీఆర్ కు తాను, కొడాలి నాని వీరాభిమానులమనీ, ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా తీయడం తమ అదృష్టంగా భావిస్తున్నామనీ పేర్కొన్నారు. ఈ చిత్రానికి తాము కూడా పనిచేయడం సంతోషంగా ఉందని ఎమ్మెస్ నారాయణ, రామజోగయ్య శాస్త్రి, రామ్-లక్ష్మణ్ పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|