వెండితెరపై లక్ష్మీప్రసన్న!
డాక్టర్ ఎం.మోహన్ బాబు కుమార్తె లక్ష్మీప్రసన్న విద్యాధికురాలు మాత్రమే కాకుండా మంచి వాక్ చాతుర్యం, ఏ కొత్త ప్రాజెక్ట్ చేప్పటినా తగిన చొరవ, నేర్పుతో అందరినీ ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే లక్ష్మీప్రసన్న బ్యానర్ పై 50కి పైగా చిత్రాలను మోహన్ బాబు నిర్మించగా, ఇప్పుడు లక్ష్మీప్రసన్న పూర్తి స్థాయి నిర్మాతగా మారి తన సోదరుడు మనోజ్ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు బుల్లితెరపై టాక్ షో ద్వారా ఆమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా ఆమె సిల్వర్ స్క్రీన్ పై కూడా కనిపించబోతున్నట్టు ఫిల్మీ వర్గాల భోగట్టా. అదికూడా కె.రాఘవేంద్రరావు నిర్మిస్తున్న కొత్త చిత్రంలో కావడం విశేషం.
కె.రాఘవేంద్రరావు తన కుమారుడు కె.ప్రకాష్ దర్శకత్వంలో సిద్ధార్ధ హీరోగా ఓ సోషియో ఫాంటసీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సిద్దార్ధకు జోడిగా కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ నటిస్తూ తొలిసారి తెలుగులో అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రంలో లక్ష్మీప్రసన్న కూడా నటించనుందనీ, నెగిటివ్ టచ్ ఉన్న పాత్రను ఆమె పోషించనున్నారనీ తెలుస్తోంది. అయితే అధికారికంగా ఈ విషయం ఇంకా ధ్రువీకరణ కావాల్సి ఉంది.
Be first to comment on this News / Article!
|