రవితేజ చిత్రం 25న ప్రారంభం
రవితేజతో గత ఏడాది 'కిక్' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన నిర్మాత వెంకట్ మళ్లీ రవితేజ కాంబినేషన్ లోనే ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. కె.అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 9గా ఈ చిత్రం రూపొందనుంది. గోపీచంద్ మలినేని ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం కానున్నారు. ఈనెల 25న హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని వెంకట్ తెలిపారు.
'కిక్' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత మళ్లీ రవితేజతో ఈ చిత్రం నిర్మించనుండటం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 'కృష్ణ' వంటి సెన్సేషనల్ హిట్ చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్ గా నటించిన త్రిష మళ్లీ ఈ చిత్రంలో ఆయనకు జంటగా నటించనుందని తెలిపారు. అలాగే 'మగధీర' వంటి రికార్డ్ బ్రేక్ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించిన డాక్టర్ శ్రీహరి ఈ చిత్రంలోనూ ఓ విభిన్నమైన పాత్రను పోషించనున్నారని తెలిపారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. గోపిచంద్ మలినేని కథ-స్క్రీన్ ప్లే సైతం అందించిన ఈ చిత్రానికి కోన వెంకట్ మాటలు, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|