ఎన్టీఆర్ ఫ్యాన్స్ రక్తదానం
స్వర్గీయ నందమూరి తారక రామారావు 14వ వర్ధంతిని పురస్కరించుకుని మెదక్ జిల్లా రామచంద్రాపురం సమీపంలోని సాయి కాలనీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. 144 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ నూతన సంవత్సరం క్యాలెండర్ ను కూడా వీరు ఆవిష్కరించారు.
మెదక్ జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఎస్.రాజుయాదవ్, సాయికాలనీ ఎన్టీఆర్ యువసేన అధ్యక్షుడు శివనారాయణ, ఉపాధ్యక్షుడు సంజయ్ కుమార్, ధర్మారావు, మనోజ్ కుమార్, గోవర్ధన్, రామచంద్రరావు, వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం జరిగింది. పటాన్ చెరు కార్పొరేటర్ ఎం.సఫానదేవ్, మాజీ ఎంపిపి మహిపాల్ రెడ్డి, మెదక్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శశికళ, యాదవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|