నవ నాయకుల 'తేజం'
యువత మనోభావాలు, ప్రస్తుత వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'తేజం'. ఈ చిత్రం ద్వారా తొమ్మిది మంది హీరోలు పరిచయమవుతున్నారు. ఎ.బలరాం సమర్పణలో సన్ రేస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్.కె.ఎస్.గోపి దర్శకుడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతోంది.
దర్శకుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ, తొమ్మిది మంది హీరోలను పరిచయం చేస్తూ, మంచి టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించిన చిత్రమిదని తెలిపారు. నేటి యువత మనోభావాలకు ఈ చిత్రం అద్దంపడుతుందన్నారు. ప్రీతి జింగానియా స్పెషల్ సాంగ్, బ్రహ్మానందం కామెడీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని అన్నారు. నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ, ఇప్పటికే ఈ చిత్ర ఆడియోకి మంచి స్పందన వచ్చిందనీ, పాటలెంత బాగున్నాయో వాటి చిత్రీకరణ అంతకంటే బాగుంటుందనీ చెప్పారు. వ్యాపారపరంగా కూడా మంచి ఆదరణ లభిస్తోందనీ, ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 'క్లీన్ యు' సర్టిఫికెట్ వచ్చిందనీ చెప్పారు. సెన్సార్ సభ్యుల నుంచి కూడా ప్రశంసలు లభించినట్టు తెలిపారు. ఫిబ్రవరి మొదటివారంలో సినిమా విడుదలకు సన్నాహాల చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో సర్దార్ పటేల్, సురేష్, మహేష్, వినోద్, వివేక్, దిలీప్ (రాజు), గౌతమ్, జయవర్ధన్, మోనిషా, దివ్య, ఎమ్మెస్ నారాయణ, కిషోర్ దాస్, అల్లరి సుభాషిణి తదితరులు నటించారు. గణ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|