శివరాత్రికి 'కళవర్ కింగ్'
నిఖిల్, శ్వేతబసుప్రసాద్ జంటగా రూపొందుతున్న చిత్రం 'కళవర్ కింగ్'. ఎల్.సురేష్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ ధనలక్ష్మీ క్రియేషన్స్ సమర్పణలో సాయికృష్ణా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ చిత్రాన్ని శివరాత్రి కానుకగా విడుదల చేయనున్నట్టు నిర్మాతలలో ఒకరైన డి.ఎస్.రావు తెలిపారు. హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో మంగళవారంనాడు ఆ విశేషాలను ఆయన తెలియజేశారు.
కేవలం కథ నచ్చి ఈ సినిమా చేశామనీ, సురేష్ లోని ప్రతిభాపాటవాలను గుర్తించి ఆయనకు దర్శకుడిగా అవకాశమిచ్చామనీ, ఆ అవకాశాన్ని ఆయన పూర్తిగా సద్వియోగం చేసుకున్నారనీ తెలిపారు. నటీనటుల ప్రతిభతో పాటు బాలమురుగన్ సినిమాటోగ్రఫీ, అనిల్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్స్ గా నిలుస్తాయమని చెప్పారు. నిఖిల్ పాత్ర చలాకీగా, అల్లరిగా ఉంటుందనీ, 70 శాతం వినోదం, 30 శాతం సెంటిమెంట్ ఇందులో ఉంటుందనీ అన్నారు. ఈ చిత్రంలో నిఖిల్, శ్వేతబసుప్రసాద్ తమ పాత్రలకు చక్కటి న్యాయం చేశారని సహనిర్మాతలు శ్రీధర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో అజయ్, ఆలీ, వేణుమాధవ్, రఘబాబు, ధర్మవరపు, ఆహుతి ప్రసాద్, కాశీ విశ్వనాథ్, గౌతంరాజు, సత్తెన్న, దువ్వాసి మోహన్, సుమన్ శెట్టి, దేవిశ్రీ, ప్రగతి, శ్రుతి తదితరులు నటించారు. కథ-స్క్రీన్ ప్లే సైతం ఎల్.సురేష్ అందించిన ఈ చిత్రానికి చందు సంభాషణలు అందించారు.
Be first to comment on this News / Article!
|