అల్లరి నరేష్ 'చీప్ అండ్ బెస్ట్'
'బెండు అప్పారావు'లో కామెడీ, 'శంభో శివ శంభో' సెంటిమెంట్ ఇరగదీసిన అల్లరి నరేష్ వరుస సక్సెస్ లు తన ఖాతాలో జమ చేసుకున్నారు. మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకుంటూ మంచి ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు 'చీప్ అండ్ బెస్ట్' హీరో కూడా అనిపించుకోనున్నారు. వంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్ నటించనున్న చిత్రానికి ఇదే టైటిల్ ను నిశ్చయించారు. కీర్తి క్రియేషన్స్ బ్యానర్ పై ఎం.ఎల్.కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
వంశీ కాంబినేషన్ లో ఎం.ఎల్.కుమార్ చౌదరి లోగడ శ్రీకాంత్ హీరోగా 'దొంగరాముడు అండ్ పార్టీ' చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా 'గోపి గోపిక గోదావరి' చిత్రంతో మళ్లీ వంశీ ఫామ్ లోకి వచ్చిన తరుణంలో 'చీప్ అండ్ బెస్ట్' సినిమాను ఆయన సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. ఇది పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమనీ, వంశీ సక్సెస్ ఊపులో ఉండగా, అల్లరి నరేష్ మంచి స్పీడ్ లో ఉన్నాడనీ, ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే చిత్రం అందరి అంచనాలకూ మించి ఉంటుందని కుమార్ చౌదరి చెబుతున్నారు. ఫిబ్రవరిలో సినిమా ప్రారంభించి, మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ కు ఆయన ప్లాన్ చేస్తున్నారు. అల్లరి నరేష్ ప్రస్తుతం ఉషా కిరణ్ బ్యానర్ లో ఇ.సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్న 'బెట్టింగ్ బంగార్రాజు' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తయింది. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించనున్న 'సుమధురం' త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది. వీరభద్ర చౌదరి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఎ ఛానెల్ వారు రూపొందించనున్న 'ఎమ్మెల్యే' (మంచి లక్షణాలున్న అబ్బాయి) చిత్రం కూడా అల్లరి నరేష్ చేతిలో ఉంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో మరో సినిమా కూడా ఉండబోతోంది.
Be first to comment on this News / Article!
|