షకీలా పెళ్లి ముహూర్తం
సెక్సీ ఆహార్యం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ బి గ్రేడ్ సినిమాలతో ఒక దశలో నిర్మాతలకు కనకవర్షం కురిపించిన షకీలా తన మనసుకు నచ్చిన చెన్నై వ్యాపారవేత్తతో మరి కొద్దిరోజుల్లోనే పెళ్లి పీటల మీద కూర్చోనుంది. ఫిబ్రవరి 4న వివాహ ముహూర్తంగా ఇరుకుటుంబాల పెద్దలు నిశ్చయించినట్టు తెలిసింది. చెన్నైలో ఈ వివాహ వేడుక జరుగుతుంది.
షకీలా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి వార్తను వెల్లడించింది. చెన్నైకి చెందిన పి.జి.సతీష్ అనే వ్యాపార వేత్తను షకీలా పెళ్లాడబోతోంది. విజయ్ కాంత్ డిఎండికె పార్టీతో ఆయనకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అలాగే ఫిల్మ్ ఫైనాన్సియర్ గా, రియాల్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. చాలాకాలంగా తమ మధ్య పరిచయం ఉందనీ, ఒకరినొకరు అర్ధం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నామనీ షకీలా తెలిపింది. ఇందుకు ఇరుకుటుంబాల పెద్దలు అంగీకరించడంతో గత డిసెంబర్ లో నిశ్చితార్థం జరిగింది. కొద్దికాలంగా మలయాళంలో బి గ్రేడ్ మూవీస్ కు స్వస్తి చెప్పిన షకీలా ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో మాత్రనే నటిస్తోంది. పెళ్లయినంత మాత్రాన సినిమాల్లో నటించకూడదనే రూలు లేదనీ, అయితే సతీష్ తో చర్చించన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామనీ షకీలా చెబుతోంది.ప్రసుతం తమిళంలో 'మాంజ వేలు', 'తొట్టు పార్', 'పయనగల్ తోడరుం' చిత్రాల్లో షకీలా నటిస్తోంది.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|