బ్యాంకాక్ లో ప్రభాస్ ఫైట్
ప్రభాస్ కథానాయకుడుగా కరుణాకరన్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ('డార్లింగ్' పేరు పరిశీలనలో ఉంది) బ్యాంకాక్ కు వెళ్తోంది. ఈనెల 21 నుంచి స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ సారథ్యంలో ఓ భారీ ఫైట్ ను పది రోజుల పాటు అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ ఫైట్ లో ప్రభాస్ తో ఫారెన్ ఫైటర్లు పాల్గొంటారు.
నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ, 'ఛత్రపతి' వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత ప్రభాస్ తో తమ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని చెప్పారు. స్విట్జర్లాండ్, అరుకు, హైదరాబాద్ లో ఇంతవరకూ షూటింగ్ జరిపామన్నారు. బ్యాంకాక్ షెడ్యూల్ తర్వాత మళ్లీ హైదరాబాద్ లో జరిపే షెడ్యూల్ తో ఫిబ్రవరికల్లా షూటింగ్ పూర్తవుతుందని చెప్పారు. ప్రభాస్ కెరీర్ లోనే ఓ డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని కరుణాకరన్ తెరకెక్కిస్తున్నారనీ, తమ బ్యానర్ కు మరో సూపర్ హిట్ ఖాయమనీ ధీమా వ్యక్తం చేశారు. ప్రభాస్ కు జోడిగా కాజల్ నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో ప్రభు ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆండ్రూస్ సినిమాటోగ్రఫీ, జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|