'వరుడు' లోగో ఆవిష్కరణ
అల్లు అర్జున్ కథానాయకుడుగా గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్శల్ మీడియో పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న 'వరుడు' చిత్రం రెండు పాటల చిత్రీకరణ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంతవరకూ ఈ చిత్రానికి చెందిన పబ్లిసిటీ స్టిల్స్ కూడా రిలీజ్ చేయకుండా సస్పెన్స్ లో ఉంచిన చిత్రయూనిట్ శుక్రవారంనాడు 'వరుడు' లోగోను హైదరాబాద్ లో ఆవిష్కరించింది.
నిర్మాత దానయ్య మాట్లాడుతూ, సినిమా చాలా బాగా వచ్చిందనీ, బన్నీతో తమ బ్యానర్ నుంచి వచ్చిన 'దేశముదురు' తరహాలోనే ఈ చిత్రం కూడా పెద్ద హిట్ అవుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ, సమ్మర్ కానుకగా రిలీజ్ ఉంటుందనీ చెప్పారు. అల్లు అర్జున్ అద్భుతమైన నటన ప్రదర్శించాడనీ, సినిమా రిలీజ్ తర్వాత అతని నటనా ప్రతిభను ప్రతి ఒక్కరూ ముచ్చటించుకోవడం ఖాయమనీ గుణశేఖర్ పేర్కొన్నారు. నిజజీవితంలోని 100 కుటుంబాలకు చెందిన వారిని ఇందులో నటింపజేశామనీ, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం తెరకెక్కిందనీ చెప్పారు. ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య విలనీ పాత్ర పోషించగా, సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, అల్లు అర్జున్ తల్లిగా సీనియర్ నటి సుహాసిని కీలక పాత్రలు పోషించారు. వేటూరి సుందరరామమూర్తి పాటు, ఆర్.డి.రాజ శేఖర్ సినిమాటోగ్రఫీ, మణిశర్మ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|